• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • KARIMNAGAR BELIEVE IN REAL GOLD THEY GIVE FAKE GOLD IN KARIMNAGAR VB KNR

Fraud: అసలు బంగారంతో నమ్మిస్తారు.. నకిలీ బంగారం ఇచ్చి మస్కా కొడతారు.. వీళ్ల మోసం మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం (image-twitter)

Fraud: భూమిని చదును చేస్తున్న క్రమంలో తమకు బంగారం దొరికిందని.. దానిని మేము సగం ధరకు అమ్ముతాం అని స్థానిక బంగారు నగల వ్యాపారులను నమ్మిస్తారు. మొదట అసలు బంగారం ఇచ్చి పరిశీలించమని చెప్పి తర్వాత బ్యారం ఓకే అయిన తర్వాత నకిలీ బంగారం ఇచ్చి మస్కా కొడతారు. ఇలాంటి మోసాలు బెంగళూరు కేంద్రంగా నడుస్తున్నాయి.

  • Share this:
    (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

    ప్రస్తుతం ఆన్లైన్ మోసాలతో పాటు రోజుకో కొత్త తరహా నేరాలు జరుగుతున్నాయి . కొద్దిరోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ ముఠా సంచరిస్తోంది . పట్టణాల్లో తిరుగుతూ మొదట స్థానికంగా ఉండే వ్యాపారులతో పరిచయం పెంచుకుంటారు . వారు పూర్తిగా నమ్మిన తర్వాత తమకు తెలిసిన వ్యక్తి జేసీబీతో భూమి చదును చేసే క్రమంలో బంగారు నగలు దొరికాయని ఫోన్ లలో ఫొటోలను పంపిస్తారు . వీటిని మార్కెట్లో ఉన్న బంగారం ధరలో సగానికే విక్రయించాలని అనుకుంటున్నామని వారితో బేరసారాలకు దిగుతారు . వీరి మధ్య సయోధ్య కుదిరితే బెంగళూరు రావాలని కోరుతారు . వారిని నమ్మించేందుకు నిందితులు మొదట అసలు బంగారు నగలనే వారికి ఇచ్చి పరీక్ష చేసుకోమంటారు . వీరు వాటిని పరీక్షించి నిజమైన బంగారమే కావడంతో పూర్తిగా నమ్ముతారు . నగలను తీసుకువచ్చేందుకు బెంగళూరు వెళ్లిన వ్యాపారులకు నిందితులు అసలు బంగారం నగలను పోలిన నకిలీవి ముట్టచెబుతున్నారు . తీరా నగలను తీసుకువచ్చిన తర్వాత పరీక్షిస్తే తాము మోసపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు .

    ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి నగల కోసమై రూ .15 లక్షలు నిందితులకు ముట్టజెప్పారు . ఇదే తరహాలో జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి లో జిల్లాలో కూడా వ్యాపారులు మోసపోయారు . తాము ఆశపడి మోసపోయిన తీరుతో పోలీసులకు ఫిర్యాదు ఇస్తే మార్కెట్ లో తమకున్న విలువ పోతుందని వాపోతున్నారు . ఈ ముఠా చేతిలో ఇప్పటికే పదిమందికి పైగా బంగారు వ్యాపారులు వారి వలలో పడినట్లు తెలుస్తోంది . ఈ ముఠా పై పోలీసులు ప్రత్యేక దృష్టిసారిస్తే కొత్త తరహా మోసాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది .

    ఇలాంటిఆగడాలు రోజు రోజు పెరుగుతున్నా ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరైన ఇలాంటి మోసాలు పాల్పడినట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలనీ నకిలీ బంగారం మోసగాళ్ల వలలో చిక్కకూడదని బంగారం వ్యాపారులకు పోలీసులు సూచించారు. నకిలీ బంగారం ముఠా సభ్యులను త్వరలోనే పట్టుకొని నిందితులను తగిన శిక్ష వేస్తామన్నారు.
    Published by:Veera Babu
    First published: