Home /News /telangana /

KARIMNAGAR BEAUTIFUL YOUNG WOMAN TRAPPING YOUNG MENRECORDING NUDE VIDEOS AND MAKING THREATS KNR VB

Cheating Woman: ఈమె ఎంత ముదురంటే.. ఏ యువకుడు అయినా లొంగిపోవాల్సిందే.. నగ్నంగా చూపిస్తూ మరీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cheating Woman: ఆమె .. అందమైన యువతీ యువకులకు వలపు వల విసురుతుంది. ఆ తరువాత తప్పుడు పేరు చెప్పి పరిచయం చేసుకొని ఫోన్ నెంబర్లు సేకరించి చాట్ చేస్తుంది .తర్వాత వీడియో కాల్ అంటూ నగ్నంగా చూపిస్తూ.. అటువైపు వారు కాస్త లోబడి వారు కూడ ఇలా చేయడం తో అది రికార్డ్ చెసి తరువాత డబ్బులు డిమాండ్ చేసేంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,News18,Karimnagar)

  ఆమె .. అందమైన యువతీ యువకులకు వలపు వల విసురుతుంది. ఆ తరువాత తప్పుడు పేరు చెప్పి పరిచయం చేసుకొని ఫోన్(Phone) నెంబర్లు సేకరించి చాట్ చేస్తుంది .తర్వాత వీడియో కాల్ అంటూ నగ్నంగా చూపిస్తూ.. అటువైపు వారు కాస్త లోబడి వారు కూడ ఇలా చేయడం తో అది రికార్డ్(Record) చెసి తరువాత డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఈ విషయాలు బయట పెడతానంటూ బెదిరిస్తు పలువురిని మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలా కొందరు బాధితులు ఇప్పటికే లక్షలు ముట్టజెప్పారు . కానీ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళ చేస్తున్న మోసాలు బయటపడ్డాయి.

  Don't Do This: సర్లే అని సాయం చేశారో.. ఇక అంతే.. ఇలా మాత్రం మీరు చేయకండి..


  కరీంనగర్ టౌన్(Karimnagar Town) అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం .. ఇప్పటి వరకు మొత్తం 34 సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసింది . టార్గెట్ చేసిన వ్యక్తులను తన ఫేక్ అకౌంట్ల ద్వారా తాను మ్యూచువల్ ఫ్రెండ్ గా చాట్ చేస్తూ వీడియో కాల్ మాట్లాడుతుంది. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఈమె ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నది. మిషన్ భగీరథ'లో కాంట్రాక్టు ఉద్యోగి అయిన ఈమె కరీంనగర్లో నివాసం ఉంటున్నారు . పేస్ బుక్ ఇతర సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించి తర్వాత పేస్ బుక్ రిక్వెస్ట్ పెట్టి యువతీ యువకుల ఫొటోలు సేకరించి వారి ఫొటోలతో అకౌంట్లను క్రియేట్ చేసేంది . ఒక్కరే చలా మందిగా నమ్మించింది .  రూ . లక్షల రూపాయలు కాజేసిందని  అని ఏసీపీ తెలిపారు . అలా అటు అమ్మాయిలు .. ఇటు అబ్బాయిలతో చాట్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు లాగేసుకుంది .

  EPFO Users: 22.5 కోట్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ట్విట్టర్ ద్వారా కీలక ప్రకటన..


  ఆ తరువాత వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకున్న కొందరి చాట్ లు వీడియో లు బయటపెడుతానని అందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరించేది . ఈ మహిళకు ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకున్నా కుటుంబం ఉన్నట్లు ఫొటోలు క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసేది . సమయానికి అనుగుణంగా ఫొటోలను మారుస్తూ  ఎదుటివారిని నమ్మించేది . అంతేకాకుండా తన ఫేస్ బుక్ అకౌంట్లో ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ తో గొంతు మార్చి మాట్లాడేది అని పోలీసులు తెలుపుతున్నారు . ఇదిలా ఉండగా ఈమె తనతో రూంలో ఉన్న యువతిని కూడా మోసం చేసిందని తెలిపారు . అందమైన అబ్బాయి ఫొటో పెట్టి ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసింది . ఆ తరువాత అకౌంట్ నుంచి ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆమెతో పరిచయం చేసుకుంది . ఆ తరువాత తన పర్సనల్ చాట్ బయటపెడుతానని బ్లాక్ మెయిల్ చేసింది .

  Ambulance Driver: అతడు ఒక అంబులెన్స్ డ్రైవర్.. ఉదయం లేవగానే కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా అంటే..


  అంతేకాకుండా పక్కకు వెళ్లి మొగగొంతుతో మాట్లాడుతూ రూమ్మేట్ ను మోసం చేసింది . ఇప్పటికే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని విడాకులిచ్చిన ఈమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది . ఆయనకూ దూరంగా ఉంటోంది . వీరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది . తాను మోసం చేసిన యువతుల్లో ఒకరికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది . అయితే తనకు కాబోయే భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సదరు మహిళను పోలీసులు విచారించారు .

  దీంతో అసలు విషయం బయపడింది . ఇందులో ఇంజనీర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం . అమె ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నది . కానీ ఫేక్ అకౌంట్లతో పెద్ద పెద్ద వాళ్లను బుట్టలో వేసుకుంది అని పోలీసులు తెలిపారు . ఆమె దగ్గరి నుంచి ఓ ల్యాప్ టాప్ రూ. 2.5 లక్షల నగదు 10 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు . అంతేకాకుండా ఆమె ఇప్పటి వరకు 50 లక్షల వరకు దండుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:Veera Babu
  First published:

  Tags: Cheating case, Cirme, Crime news, Karimnagar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు