హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana BJP: ఈనెల 11 తో ముగియనున్న బీజేపీ తెలంగాణ చీఫ్​ బండి సంజయ్​ పదవీ కాలం.. కొత్త అధ్యక్షుడు ఎవరంటే..?

Telangana BJP: ఈనెల 11 తో ముగియనున్న బీజేపీ తెలంగాణ చీఫ్​ బండి సంజయ్​ పదవీ కాలం.. కొత్త అధ్యక్షుడు ఎవరంటే..?

బీజేపీ (ప్రతీకాత్మక చిత్రం)

బీజేపీ (ప్రతీకాత్మక చిత్రం)

బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై మార్చి 11 కు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఈ దఫా అధ్యక్ష బాధ్యతలు ఎవరిని వరిస్తాయనే చర్చ చాలారోజులుగా సాగింది. 

(న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్.పి)

బండి సంజయ్ (bandi Sanjay) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా (BJP state president) నియమితులై మార్చి 11 కు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఈ దఫా అధ్యక్ష బాధ్యతలు ఎవరిని వరిస్తాయనే చర్చ బీజేపీలో (Telangana BJP) చాలారోజులుగా సాగింది. ఇటీవల సంజయ్​కి కేంద్ర పార్టీ నుంచి పిలుపు వచ్చినపుడు సంజయ్​ని కేంద్ర మంత్రి చేస్తారని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ (Etala rajendar)ను నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కేంద్ర బీజేపీ నాయకత్వం  మాత్రం 2023 లో జరిగే అసెంబ్లీ , 2024 లో జరిగే పార్లమెంట్​ ఎన్నికల వరకు సంజయ్​నే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో రెండో విడత పాద యాత్ర (Second phase pada yatra)కు సిద్ధమవుతుండటంతో దీనికి బలం చేకూరినట్లయింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) ఏప్రిల్ 14 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు . పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు బండి సంజయ్ (Bandi sanjay) చెప్పారు. మొదటి విడతలో 36 రోజుల పాటు పాదయాత్ర సాగగా .. ఈ సారి 200 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు . మొత్తం ఐదు విడతలుగా ఆయన పాదయాత్ర చేయనున్నారు . కరోనా దృష్ట్యా ఆలస్యమైన రెండో విడత యాత్రను జోగులాంబ గద్వాల్ జిల్లా (Gadwal) నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర షెడ్యూలు విడుదల కేంద్రంలోని బీజేపీ  అనుమతితో చేశారు కనుక మార్చి 11 తరువాత ఆయన్నే కొనసాగిస్తారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.  బండి సంజయ్ కుమార్. స్వయం సేవకుడి నుంచి కార్పొరేటర్​గా ప్రజాసేవ చేస్తూ కరీంనగర్ ఎంపీగా గెలు పొంది హిందుత్వ నినాదంతో కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లాలో మంచి పట్టు సంపాదించుకున్నారు.

కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా..

సంజయ్ పాదయాత్ర ఖరారు కావడంతో ​ పార్టీ చీఫ్​ బాధ్యతల్లో కొనసాగుతున్నట్లు ఖాయమైపోయింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్, కరీంనగర్ (Karimnagar) మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగరావు తరువాత బండి సంజయ్​కి కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం లభించింది . బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ సొంత పార్టీలోనే ప్రత్యర్దుల దాడిని ఎదుర్కొంటూ ఒంటరి పోరాటంతో ఎన్నికల్లో నిలబడి విజయం సాధించారు . రెండు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలైనా.. మరో అడుగు ముందుకు వేస్తూ గులాబీ కంచు కోటను బద్దలు కొట్టి అందరి అంచనాలను తలకిందులు చేశాడు .

పార్టీలో కిషన్ రెడ్డి (Kishan reddy) తరువాత యువనాయకుడిగా యువతలో క్రేజ్​ ఉన్న సంజయ్ పార్టీని తెలంగాణపై జెండా ఎగరేసే దిశగా నడిపిస్తారనే విశ్వాసాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్​ సేవకుడిగా ఉంటూ ఏబీవీపీ విద్యార్థి పరిషత్​లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో ఎన్నికల ప్రచా ర ఇన్​ఛార్జీగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు . దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రముఖ పీఠాధిపతులతో సత్సంబంధా లు కొనసాగిస్తూ వారికి ప్రముఖ శిష్యుడిగా గుర్తింపబడ్డారు. ఆధ్యాత్మిక పరమైన సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.

సద్దుమణిగిన అసమ్మతి రాగం..

ఇటీవల బీజేపీ (Telangana BJP)లో అసమ్మతి మొదలైన సంగతి తెలిసిందే. అందులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలు కూడా ఉన్నారు . వారంతా సంజయ్ తమను చిన్నచూపు చూస్తున్నారని సమావేశం పెట్టుకోవడంతో ఇటీవల పార్టీలో చర్చకు దారితీసింది . అయితే అది సద్దుమనగడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు . తెలంగాణలో జెండా ఎగరేయాలని చూస్తున్న బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు యూత్​లొ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సంజయ్​ని కొనసాగిస్తేనే మంచిదని బీజీపీ అధినాయకత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసింది .

బీజేపీ విజయాలతో..

ఏరికోరి ఎంపిక చేసిన అధిష్టానం వద్ద సంజయ్​ మంచి మార్కులు సంపాదించాడు . దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం , ఆ తరువాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్​తో సరిసమానంగా సీట్లు దక్కడం . హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయంతో సంజయ్ కి క్రేజ్​ మరింత పెరిగింది . బండి  సంజయ్​పై  సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసిన సందర్భంతో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్టీ, ఆర్ఎస్ నేతల చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు జరిగిన కుట్ర కేసు బీజేపీ నేతల వైపు వస్తుండటంతో దీన్ని ఎలా తిప్పికొడుతారన్న ఆసక్తి బీజేపీ వర్గాల్లో నెలకొంది ..

First published:

Tags: Bandi sanjay, Telangana bjp

ఉత్తమ కథలు