(P.Srinivas,New18,Karimnagar)
తెలంగాణ రాజకీయాల్లో కరీంనగర్ రాజకీయాలకు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. పొలిటికల్ హీట్ ను పెంచడం లో కరీంనగర్ జిల్లా ఎల్లప్పుడూ ముందుంటుంది. తాజాగా నిన్న మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. దొంగలు పడ్డాక ఆరు నెలలకు కేటీఆర్ స్పందించారంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మంత్రి సోదరి ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ ను చెప్పుతో కొడతానందని, తండ్రి సీఎం కేసీఆర్ నన్ను ఆరు ముక్కలు చేస్తానన్నారు. ఇప్పుడు కేటీఆర్ చెప్పుతో కొడతానంటున్నాడు. కుటుంబం మొత్తానికి డబ్బులు ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారని కల్వకుంట్ల కుటుంబంపై బండి ఫైర్ అయ్యారు.
నేను తంబాకు తింటున్నట్లు ఆరోపణలు చేసినప్పుడు నీ సంస్కారం ఏడబోయిందని ప్రశ్నించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు బయట పడ్డాక ఎందుకు ఈ మాట చెప్పలేదంటూ మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో సిట్ నివేదిక బయట పెట్టాలన్నారు. వేములవాడకు, ధర్మపురికి ఇస్తామన్న డబ్బులేవీ? పైగా భక్తులిచ్చిన డబ్బులు వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తీగలగుట్టపల్లి వంతెన మీ చుట్టపోడు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నేను వచ్చాకే ఆర్డీబీ కోసం కేంద్రం వాటాపై వాటాపై ఫైనాన్షియల్ సపోర్టు తెచ్చానన్నారు. రాష్ట్ర వాటా 80 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బీజేపీని బద్నాం చేయాలని ఇప్పుడు కొత్త నాటకమాడుతున్నారని మండిపడ్డారు. బూతులు తిట్టడం తప్ప వీరికి ఏదీ చేతకాదంటూ ఫైర్ అయ్యారు. గంగాధర, తీగలగుట్టపల్లి ఆర్వోబీలు మంజూరయ్యాయని తెలిపారు. చెల్లి లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
సెస్ ఎన్నికల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ మాటలు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకే మా పోరాటం అని బండి సంజయ్ తెలిపారు. దేవున్నే నమ్మని నాస్తికుడు కేటీఆర్ అన్నాడు. పీసీసీ అధ్యక్షుడు ఛాలెంజ్ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై ఈ ప్రభుత్వం ఎందుకు విచారణ ఆపేసిందని ప్రశ్నించారు. దీని వెనక ఎవరున్నారు? విదేశీ లావాదేవీలు ఎంత జరిగాయో బయటపడుతాయన్నారు. నేను ఏ ఎమ్మెల్యే పేరు డ్రగ్స్ వ్యవహారంలో చెప్పలేదన్నారు. కానీ విచారణలో ఎవరున్నా బయటకు రావాలి? నా పనితీరు అడిగే ముందు.. మీ అయ్య ఇచ్చిన హామీల సంగతేందో చెప్పాలన్నారు.
నీ కరాబైన కిడ్నీ వాళ్లేం చేసుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూన్నెళ్ల ట్రీట్ మెంట్ తర్వాత ఇప్పుడు పరీక్షలకు సిద్ధమంటున్నాడని కేటీఆర్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, BRS, CM KCR, Kalvakuntla Kavitha, Karimnagar, KTR, Telangana, Trs