తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ కరీంనగర్ (Karimnagar) లో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సభలో బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ..కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నుండి ఉద్యమకారులను బయటకు పంపారు. BRS నుంచి తెలంగాణ పేరు తీసేశారని ఆరోపించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుమ్మక్కై దోచుకుందాం..దాచుకుందాం అనే పాలసీని ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు.
దుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదంతో నేను బతికిన. మీకు సేవ చేసే భాగ్యం కలిగింది. నేను ముందు ఈ డివిజన్ కార్పొరేటర్ ను. 2014లో నాకు ఎమ్మెల్యేగా 47 వేల ఓట్లు ఇచ్చారు. కరీంనగర్ గడ్డ నన్ను ధర్మం కోసం పని చేయమంది. 2018లో ఎమ్మెల్యేగా నాకు 68 వేల ఓట్లు వచ్చాయి. నేను ఎందుకు ఓడిపోయానో మీకు తెలుసు. ఇంకొకరికి కొమ్ము కాసే అలవాటు నాకు లేదని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. సమాజానికి, ధర్మానికి తలవంచే పని ఎప్పటికి చేయను. బండి సంజయ్ ఓడిపోతే కార్యకర్తలు ఏడుస్తున్నారని చర్చ జరిగింది. మీ కష్టార్జిత ఫలితమే నేను నేను కరీంనగర్ ఎంపీగా గెలిచాను. మీ వల్లనే కరీంనగర్ లో పింక్ కలర్ జెండాను బొందపెట్టి, కాషాయ జెండాను రెపరెపలాడించాం అన్నారు.
కరీంనగర్ గడ్డపై ఎంపీగా లక్ష మెజారిటీతో మీరు మీ బండి సంజయ్ ను గెలిపించారు. కార్యకర్తల కష్టం, ప్రజల అభిమానంతోనే నేనే గెలిచా. ఏ లక్ష్యంతో బీజేపీ అధిష్టానం నన్ను రాష్ర అధ్యక్షుడిని చేసిందో దానికి అనుగుణంగా పని చేస్తున్న. కార్యకర్తలతో కలిసి తిరగాలని జాతీయ న్యాయకత్వం ఆదేశిస్తే మీకోసమే పాదయాత్ర చేస్తున్న. 2001లో సింహగర్జన పేరుతో టీఆర్ఎస్ పెట్టిన సభకు కూడా ఇంత మంది రాలేదు. సింహగర్జన పేరుతో తెలంగాణను సాధించుకుంటే ఇప్పుడు ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసిండు. తెలంగాణతో బంధం తెంచుకున్నాడు. కేసీఆర్ పీడ విరగడ అయిందన్నారు.
ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా వద్దా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిండు. మరోసారి కేసీఆర్ కు అధికారం ఇస్తే ఇంకో 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడు. రైతు రుణమాఫీ చేసిండా. పాదయాత్ర ద్వారానే 8 ఏళ్లుగా ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ బీజేపీకి భయపడి, బయటకొచ్చిండని అన్నారు. TRS దుకాణం తీసేసి..ఢిల్లీలో BRS దుకాణం తెరిచాడని అన్నారు. Brs అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి, బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, BRS, CM KCR, Karimnagar, Telangana, Telangana News, Trs