(పి. శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా, న్యూస్18 తెలుగు)
శరీరాన్ని విల్లులా వంచుతూ క్లిష్ట ఆసనాలు, కఠోర వ్యాయామాలు అవలీలగా చేస్తూ అబ్బురపరుస్తోంది ఎనభై తొమ్మిది సంవత్సరాల బామ్మ జీరురు కనక లక్ష్మి .పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జీగురు కనకలక్ష్మి గత 30 ఏళ్లుగా నిత్యం తెల్లవారు జామున 4 గంటలకే యోగాసనాలు వేస్తుంటారు. తన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వైద్యుల సూచనల మేరకు అరవైయ్యేళ్ల వయసులో యోగా నేర్చుకున్నారు. ఈమెను ఊళ్లో అందరూ యోగా బామ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు. చిన్నతనంలో అంబలి, గట్కా, వ్యవసాయ పనులు వెళ్లడం వల్లే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం తేలికపాటి భోజనం, రాత్రి వేళలో పండ్లు, అల్పాహారం తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యం అంటారు బామ్మ.
ఇంట్లో అన్ని పనులు తనే అవలీలగా చేసేసుకుంటారు. తన గురించి తెలుసుకుని చాలా మంది వచ్చి కలిసి మాట్లాడి వెళ్తుంటారు. స్థానిక యువత, మహిళలు తనను ఆదర్శంగా తీసుకుని యోగా చేస్తుండటం సంతోషాన్ని ఇస్తోందని కనలక్ష్మి చెబుతున్నారు. తన నలుగురు కొడుకులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. కూతురును ప్రభుత్వోద్యోగికి ఇచ్చి వివాహం చేశారు.
ప్రస్తుతం తన భర్తతో పాటు స్వగ్రామంలో ఉంటూ అన్ని పనులు తానే చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తోంది. ప్రతి ఒక్కరూ యోగా చేస్తే ఆరోగ్య సమస్యలు ఉండవని ఈ బామ్మ భరోసాగా చెబుతున్నారు. జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కషాయం లాంటివి సహజసిద్ధమైనవి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Old women, Yoga, Yoga day 2021