హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ukraine:ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు..ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయం..

Ukraine:ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు..ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయం..

Tension Tension: చదువు, ఉద్యోగాల కోసం వెళ్లి ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్లకు ఆంధ్రా, తెలంగాణ ప్రజాప్రతినిధులు ధైర్యం చెప్పారు. యుద్ధ వాతావరణంతో భయపడుతున్న విద్యార్దులను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బాధితుల కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చారు.

ఇంకా చదవండి ...

ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి ఉక్రెయిన్‌లో నెలకొంది. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడంతో అక్కడ ఉంటున్న వేలాది మంది తెలుగు వాళ్ల పరిస్థితి అయోమయంగా మారింది. గత కొద్దిరోజులుగా ధైర్యంగా ఉంటూ వచ్చినప్పటికి తాజాగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు చిక్కుకుపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఉక్రెయిన్‌(Ukraine)లో ఉన్న తెలుగు విద్యార్దులు (Telugu students)అంతా క్షేమంగానే ఉన్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu suresh)తెలిపారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న ఇలాంటి సమయంలో ఉక్రెయిన్‌లో ఉండి చదువుతున్న విద్యార్ధులతో ఫోన్‌(Phone)లో మాట్లాడారు. అనంతరం మీడియాకి వివరాలు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్దులు క్షేమంగానే ఉన్నారని వారిని సురక్షితంగా మన దేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్ధులను రప్పించేందుకు సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయని మంత్రి ఆదిమూలపు తెలిపారు. విద్యార్థుల సహాయం కోసం నోడల్‌ అధికారిnodal officer, స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సేకరించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh) లోని శ్రీకాకుళం (Srikakulam )జిల్లాకు చెందిన కుమారస్వామినాయుడు(Kumara swamy naidu), వంశీకృష్ణ(Vamsi krishna)తో పాటు మరికొందరు ఉన్నట్లుగా గుర్తించారు. ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్ధులకు సమాచారం చేరవేసేందుకు నోడల్ అధికారి రవిశంకర్‌ని నియమించారు. ఆయన ఫోన్‌ నెంబర్‌9871999055ని కూడా అక్కడి విద్యార్ధులకు ఇక్కడ ఉంటున్న వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆయనతో పాటు అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మను సంప్రదించాల్సిన నెంబర్‌: 7531904820తో పాటు ఏపీ ఎన్ఆర్‌టీ సీఈఓ దినేష్ కుమార్ ఫోన్‌ నెంబర్‌ని 9848460046 మీడియాకు వెల్లడించారు.

ఉక్రెయిన్‌లో వణికిపోతున్న విద్యార్ధులు..

మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకి చెందిన కొందరు ఉక్రెయిన్‌లో ఉండిపోయారు. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన కడారి సుమాంజలి ఉక్రెయిన్‌లో చిక్కుకుపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సుమంజలి కుటుంబ సభ్యుల్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెళ్లి పలకరించారు. ఉక్రెయిన్‌లో ఉన్న సుమంజలితో బండి సంజయ్ వీడియో కాల్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సుమంజలితో పాటు హైదరాబాద్‌కి చెందిన శ్రీనిధి, లిఖితతో కూడా మాట్లాడారు బండి సంజయ్.

(ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్ధులు)

తెలుగు స్టూడెంట్స్‌ సేఫ్..

ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న విద్యార్ధులు రష్యా దాడులతో అక్కడి పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని బండి సంజయ్‌కి ఫోన్‌లో తెలియజేశారు. అయితే తెలుగు విద్యార్దులకు ధైర్యం చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో ఉన్న వారిని క్షేమంగా తీసుకొచ్చే పనిలో కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు వారందరికీ ఈ విషయాన్ని చెప్పి వారిలో మనోధైర్యాన్ని నింపాలని వారికి సూచించారు. అటుపై సుమాంజలి సోదరుడు, తల్లిదండ్రులను బండి సంజయ్ ఓదార్చారు.

First published:

Tags: Andhra Pradesh, Russia-Ukraine War, Telangana, Ukraine

ఉత్తమ కథలు