Huzurabad By Elections: షాకిస్తున్న సర్వేలు.. అనూహ్యంగా మారుతున్న సమీకరణాలు.. ఆ అభ్యర్థికి ఓటమి తప్పదా..?

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad By Elections: ఉప ఎన్నికలకు పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు . అభివృద్ధి పనులే గెలిపిస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది . సానుభూతి పని చేస్తుందని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అనుకుంటున్నారు .

  • Share this:
    (P.Srinivas,News18,Karimnagar)

    ఉప ఎన్నికలకు పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు . అభివృద్ధి పనులే గెలిపిస్తాయని టీఆర్ఎస్(TRS) భావిస్తోంది . సానుభూతి పని చేస్తుందని బీజేపీ(BJP) అభ్యర్థి ఈటల రాజేందర్ అనుకుంటున్నారు . మరోవైపు కేంద్రంలోని బీజేపీ , రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల వ్యతిరేకత పని చేస్తుందని కాంగ్రెస్ (Congress) అభ్యర్థి వెంకట్ (Venkat) భావిస్తున్నారు .

    Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


    టిఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గానికి రూ. 400 కోట్ల అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధర్మానికి అధర్మానికి మధ్య నడుస్తున్న ఎన్నికలని హుజురాబాద్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ ఇచ్చిన నిధులు అన్ని కేవలం తన వల్లనే వచ్చినవని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ టిఆర్ఎస్, బిజెపి, పంపకాల పంచాయతీ వల్ల వచ్చిన ఎన్నికలని టిఆర్ఎస్ బిజెపి పార్టీ దొందూ దొందే అని ఓటు కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటూ ఓట్లు అడుగుతున్నారు.

    ఇదిలా ఉంటే బిజెపి, టిఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు సొంతగా సర్వేలు చేయించుకుంటూ ఎవరి బలాలు బలహీనతలు తెలుసుకుంటున్నారు. మొన్నటి వరకు బిజెపీకే ఎక్కువ గెలుపు పవనాలు ఉన్నాయాని సర్వేలు తెలిపాయి..నిన్నటినుండి నుండి టిఆర్ఎస్ సర్వే లు బిజెపి కంటే టిఆర్ఎస్ 27 శాతం గెలుపు దిశగా పవనాలు విస్తున్నాయని వారి,వారి సొంత సర్వేలు చెబుతున్నాయి.

    KTRకు భారీ షాకిచ్చిన KCR?-ఆపరేషన్ హైద్రావతి గుట్టు రట్టు! -TRS plenary వేళ BJP ఎంపీ సంచలనం


    మరి కావాలని సర్వేలు చేయించుకుంటున్నారా లేదా ఓటర్లను ఆకర్షించేందుకు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఉపఎన్నికల ప్రచారం మరో మూడు రోజులో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటర్లను ప్రలోభాల పర్వాల దిశగా పావులు కదుపుతున్నారు. ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుండి మరో లెక్క అనేలా టీఆర్ఎస్, బీజేపీ, ప్రచారం సాగుతుంది. స్టార్ క్యాంపెయినర్ల రాకతో హుజురాబాద్ ప్రచారం ఐతే దద్దరిల్లుతున్నది.

    ఇదిలా ఉండగా.. రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. వరుసగా 9వ సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌ ప్లీనరీ వేదికగా బాధ్యతలు స్వీకరిస్తారు. వచ్చే 9 నెలల పాటు పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తామని పార్టీ అధినేత కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు.
    Published by:Veera Babu
    First published: