Home /News /telangana /

KARIMNAGAR ANOTHER PERSON HOLDS KEY POST IN KARIMNAGAR CM KCR DECIDES TO APPOINT ANIL KUMAR AS LDC CHAIRMAN KNR PRV

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరోసారి పదవుల పంట.. గులాబీ బాస్​ నిర్ణయంతో జిల్లాలో ఉత్సాహం..

కేసీఆర్​తో అనిల్​

కేసీఆర్​తో అనిల్​

కరీంనగర్ (Karimnagar) జిల్లాకు మరోసారి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది . తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే వరస పదవుల విషయంలో జిల్లా ముందు వరుసలో నిలుస్తుండగా ఈ జాబితాలోనే మరో నేతకు పదవి అందింది .

    (G Srinivas, News 18, Karimnagar)

    కరీంనగర్ (Karimnagar) జిల్లాకు మరోసారి కార్పొరేషన్ చైర్మన్ (Corporation Chairman) పదవి దక్కింది . తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే వరస పదవుల విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందు వరుసలో నిలుస్తుండగా ఈ జాబితాలోనే మరో నేతకు కార్పొరేషన్ ఛైర్మన్ గిరి అందింది .ఇప్పటికే ముగ్గురు మంత్రులు, ఒక ప్రణాళిక చైర్మన్ (Planning Chairman), ఎస్సీ (SC), బీసీ కార్పొరేషన్ చైర్మన్ (BC Corporation Chairman) లతో పాటు  కరీంనగర్లోని రాంనగర్కు చెందిన ఎన్ఆర్ఐ అనిల్ కుమార్ (Anil kumar) కుర్మాచలానికి రాష్ట్ర చలనచిత్ర , టెలివిజన్ , థియేటర్ అభివృద్ధి సంస్థ ( ఎల్డీసీ ) ఛైర్మన్ (Chairman) గా బాధ్యతల్ని అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు . ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం వెలువరించారు . తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఎన్ఆర్ఐ సెల్లో చురుకైన పాత్రను పోషించిన అనిల్  ప్రస్తుతం తెరాస లండన్ విభాగం అధ్యక్షుడిగా (President of the TRS London Division)కొనసాగుతున్నారు .

    యూకేలో పనిచేస్తూ..

    సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా యూనైటెడ్ కింగ్డమ్ (UK) పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రసాధన కోసం ఈయన తనదైన పాత్రను పోషించారు . తెలంగాణకు చెందిన వారందరికి ఆయా దేశాల వారీగా సంఘాలను ఏర్పాటు చేయడంతోపాటు తెరాసకు అనుబంధంగా పనిచేసేలా తనవంతు తోడ్పాటును అనిల్ చూపించారు . రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రచారం చేసే విషయంలో తనవంతు సహకారాన్ని అందించారు . పలుదేశాలు తిరుగుతూ తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలియజేసేలా ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించారు . గడిచిన ఏడాది కాలంగా హైద్రాబాద్లో ఉంటున్నారు .

    'తనకి కీలకమైన బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు (CM KCR) మంత్రి కేటీఆర్కు (KTR) కృతజ్ఞతలు తెలుపుతున్నానని .. ఇది ఎన్ఆర్ఎ(NRI)లకు దక్కిన గౌరవంగా తను భావిస్తున్నానని ' అనిల్ కుమార్ అన్నాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Karimnagar, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు