హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది..ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం మొదలు కాగా తాజాగా ఇరువర్గాల ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు..ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈటల బావమరిది చేశాడంటూ వచ్చిన వాఖ్యలు నియోజకర్గంలో దుమారం లేపాయి..ఈ నేపథ్యంలోనే ఆయన దళితులను కించపరిచినట్టుగా ఉన్నాయంటూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ... ఆయన దిష్టిబొమ్మను దగ్గం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వాట్సప్..వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది దళితులు ఈటల దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్‌కు మాత్రం మరికొంతమంది దళితులు పాలాభిషేకం చేశారు..అనంతరం ఈటల కూడా వారికి పాలభిషేకం చేశారు. ఈ నేపథ్యలోనే వాట్సప్ పేరుతో తామపై బురద జల్లుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ వాట్సప్ కుట్రకు కారకులు ఎవరో త్వరలో బయటపెడతామని ఈటల జమున అన్నారు.
కాగా ఇదే అంశంపై మోత్కుపల్లి స్పందించారు. ఈటల బావమరిదిచేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆయన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ టీఆర్ఎస్ చర్యలు తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ కుట్రలు త్వరలో బయటపెడతామని హెచ్చరించారు.
మొత్తం మీద హుజూరాబాద్‌లో రాజకీయ కుట్రలు, కుత్రంత్రాలకు వేదికైంది.ఇరు పార్టీలు తమ బలాన్ని పెంచుకునేందకు ప్రయత్నాలు చేస్తున్నారు..ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈటల ఇమెజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలకు తెరలేపింది..అటు అభివృద్ది పరంగా కూడా అనేక పథకాలు,పదవులను హుజూరాబాద్ నియోజవకర్గం నుండి ప్రారంభిస్తూ..తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది..ఈ నేపథ్యంలోనే అటు ఈటల ఇటు టీఆర్ఎస్ వర్గాల మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.