తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇప్పటి వరకు విమర్శలు, ప్రతి విమర్శలతో దాడులు పెంచుతున్న ఏపీ, తెలంగాణ మంత్రులు.. ఇప్పుడు కేంద్రం దగ్గరకు పంచాయతీని తీసుకెళ్తున్నారు. అక్కడితోనే ఆగకుండా న్యాయపోరాటానికి కూడా సిద్దమవుతున్నారు. నీటి వాటాల విషయంలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. సమస్య పరిష్కరానికి ముందడుగు వేయడం లేదు. కేవలం జల జగడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీరుపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల ముదిరిన నీటి యుద్ధానికి ఇప్పట్లో పుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపించడంలో లేదు. ఇలాంటి సమయంలో మాజీ టీడీపీ నేత, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు కరోనా కారణంగా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యిందని సంచలన ఆరోపణలు చేశారు. ఆ కారణంగానే నీటి పంపకాల ఒప్పందాలు కేసీఆర్ మర్చిపోతున్నారు అని టిజి వెంకటేష్ అన్నారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పంపకాలు కేసీఆర్ కాదంటే ఎలా అని టీజీ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నేతలు శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే అంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు అయితే సాగునీరుగా, తాగునీటి వనరుగా ఎలా వాడుకున్నారు అని నిలదీశారు. కొత్త ఒప్పందాలు రద్దయితే పాత ఒప్పందాలు పాటించాలని.. మరి నిజాం వచ్చి తన ఒప్పందం రద్దు అంటే కేసీఆర్ ఒప్పుకుంటారా అని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: వైఎస్ వివేకానంద హత్య కేసులో త్వరలో అరెస్టులు.. కీలక వ్యక్తుల విచారణ ముమ్మరం
కేసీఆర్ అపర మేధావి అన్నారు. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం రద్దు చేసి సమైఖ్యాఆంధ్ర అంటే ఆయన ఇప్పుడు ఒప్పుకుంటారని సెటైర్లు వేశారు. నిజాం పాలనపై పోలీస్ యాక్షన్ ఎలా ఉండేదో శ్రీశైలం డ్యామ్ పై పోలీస్ యాక్షన్ తీసుకొని శ్రీశైలం డ్యామ్ స్వాధీనం చేసుకోవాలి అన్నారు. జల వివాదం సివిల్ వార్ కు దారి తీసే ప్రమాదం ఉందన్నారు టీజీ. కేసీఆర్ కు రాయలసీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ఓట్లు తెలంగాణ లో ఉన్నాయి తప్ప తెలంగాణ ఓట్లు ఏపీ లో లేవని గుర్తు చేశారు. హైద్రాబాద్ లో ఎన్నికలు వస్తే ఆంధ్ర పాట… కరీంనగర్ లో ఎన్నికలు వస్తే తెలంగాణ పాట పాడడం కేసీఆర్ కు ఆనవాయితీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్.
ఇదీ చదవండి: నేడో.. రేపో కేంద్ర మంత్రి మండలి విస్తరణ..! ఏపీ నుంచి బెర్త్ ఎవరికి..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, CM KCR, TG Venkatesh, Water dispute