(P.Srinivas,New18,Karimnagar)
రోజూ కాయ కష్టం చేసుకునే వారికి అదృష్టం కలిసొచ్చింది. కాకపోతే ఆ ఆనందం వాళ్లలో ఎక్కువ సేపు లేదు. ఎందుకంటే భూమిలో దొరికిన పురాతన నాణెల పంచుకోవడం గ్రామస్తుల చెవిన పడింది. అంతే అసలు ఉపాధి హమీ కూలీలకు ఏం దొరికింది..? అవి ఎంత ఖరీదైనవి..? విషయంపై ఆరా తీసిన అధికారులకు నిజాలు తెలిశాయి. కరీంనగర్ (Karimnagar)జిల్లా తిమ్మాపూర్(Timmapur) మండలం గొల్లపల్లి (Gollapally)గ్రామంలో శుక్రవారం ఉపాధి హమీ కూలీలకు భూమి తొవ్వుతుండగా 27వెండి నాణెలు ఉన్న గురిగి ఒకటి దొరికింది. అంతే దాన్ని పగలగొట్టి అందరూ కూలీలు పంచుకున్నారు. అయితే ఆ నాణెలు 1869వ సంవత్సరం కాలం నాటివని గుర్తించారు అధికారులు. అసలు కరీంనగర్ జిల్లాలో దొరికిన వెండి నాణెల(Silver coins)ను పురావస్తుశాఖ అధికారులకు అప్పగిస్తామని రెవిన్యూ అధికారులు తెలిపారు.
మట్టిలో మనీ కాయిన్స్ ..
మట్టిలో పని చేసుకునే ఉపాధి హామీ కూలీలకు అదృష్టం పురాతన నాణెల రూపంలో తగిలింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈసీక్రెట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉపాధి పనులకు వచ్చిన కూలీలకు భూమిలో 27 వెండి నాణెలతో ఉన్న గురిగి ఒకటి దొరికింది. దాన్ని మొదట చూసి ఆశ్చర్యపోయిన కూలీలు మూడో కంటికి తెలియకుండా గురిగిని పగలగొట్టి అందులో ఉన్న నాణెలను అందరూ పంచుకున్నారు. అయితే విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న అధికారులు తహసిల్ధార్ విచారణ జరిపించారు. ఉపాధి హమీ కూలీల దగ్గరకు వచ్చి దొరికిన వెండి నాణెలు ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. దీంతో కూలీలు నిజం చెప్పారు.
ఆశ పడ్డ కూలీలు..
కూలీలకు దొరికిన నాణెలు మొత్తం సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. తహసిల్ధార్ కనకయ్య, ఎస్‌ఐ ప్రమోద్‌రెడ్డి, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి ఆర్ఐ అనీల్ కూలీల దగ్గర ఉన్న నాణెలను సేకరించారు. కూలీలకు దొరికిన వెండి నాణెలు మీర్ మహబూబ్ అలీ నవాబ్ ఖాన్ కాలానికి చెందినవిగా గుర్తించారు. అంటే 1869 నుంచి 1911 వరకు చలమణిలో ఉన్నాయని పురావస్తు శాఖ వారు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Telangana News