హోమ్ /వార్తలు /తెలంగాణ /

Singareni: సింగరేణి మహిళా కార్మికులపై లైంగిక వేధింపులు.. భర్త చనిపోయి ఉద్యోగాలు చేస్తున్న మహిళలే వారి టార్గెట్​

Singareni: సింగరేణి మహిళా కార్మికులపై లైంగిక వేధింపులు.. భర్త చనిపోయి ఉద్యోగాలు చేస్తున్న మహిళలే వారి టార్గెట్​

పెద్దపల్లి

పెద్దపల్లి

సమాజంలో స్త్రీ పని చేయాలంటేనే అవమానాలు తప్పడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 1 డివిజన్లోని టీఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కు చెందిన ఓ ఫిట్ సెక్రెటరీ దౌర్జన్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

  (పెద్దపల్లి జిల్లా, న్యూస్ 18, తెలుగు కరస్పాండెంట్​. శ్రీనివాస్.పి)

  అక్కడ ఇక్కడ అని ఏమిలేదు. మహిళలు ఎక్కడ పనిచేసిన లైంగిక వేధింపులు తప్పడం లేదు. సమాజంలో స్త్రీ పనిచేయాలంటేనే అవమానాలు తప్పడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 1 డివిజన్లోని టీఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కు చెందిన ఓ ఫిట్ సెక్రెటరీ దౌర్జన్యాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి

  సింగరేణి (Singareni) గనులలో పని చేసి ప్రమాదంలో భర్తలను కోల్పోయి ఉద్యోగాలు చేస్తున్న తోటి మహిళా కార్మికులను  లైంగికంగా కోర్కెలు తీర్చాలంటూ వారిపై వేధింపులకు గురిచేస్తున్నాడు ఆయన గారు. ఆ ఫిట్ సెక్రెటరీకి గని అధికారులు కూడా భయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన  అధికార పార్టీ అండతో టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గనీ కార్మిక సంఘం) గుర్తింపు సంఘం అనే అహంకారంతో డిపెండెంట్ ఉద్యోగాలు చేస్తున్నమహిళా కార్మికుల పై వేధింపులకు పాల్పడుతున్నట్లు గని కార్మికులు, పలువురు మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

  ఇతను చేస్తున్న ఆగడాలకు రామగుండంలోని ఓ ముఖ్య నాయకుడు వత్తాసు పలకడం గమనార్హం. టీబీజీకేఎస్ (TBGKS) కు చెందిన ఫిట్ సెక్రెటరీ , జీఎం కమిటీ సభ్యులు ఏరియా హాస్పిటల్ టీబీజీకేఎస్ కమిటీలోని కొందరు నాయకుల ప్రవర్తన వల్ల పలువురు మహిళలు సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . వీరిపై ఎలాంటి ఫిర్యాదు చేసినా అధికారులకు తెలిపినా తమపై ఎలాంటి దాడులకు పాల్పడుతారో.. పై అధికారులకు చెప్పి బదిలీలు చేయిస్తారేమోననే భయంతో ఓ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని ఎక్కడ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతూ ఆవేదన చెందుతున్నట్లు సమాచారం .

  కల్వకుంట్ల కవిత అధ్యక్షురాలిగా ఉండగా..

  టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు గా కల్వకుంట్ల కవిత కొనసాగడం ఆమె నాయకత్వంలోని ఆ యూనియన్ కు చెందిన ఓ ఫిట్ సెక్రెటరీ ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.  మహిళలపై వేధింపులకు గురిచేస్తున్న సదరు ఫిట్ సెక్రెటరీ, ముఖ్య నాయకుడిపై అధిష్టానం చర్యలు చేపట్టాలని అక్కడి మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. మహిళా ఉద్యోగినులపై టీబీ జీకేఎస్ నాయకులు ఎలాంటి వేధింపులు చేయకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు, కార్మికవర్గం కోరుతుంది . ఈ మేరకు తమ గోడు విన్నవించెందుకు త్వరలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

  బహిష్కరించాలి..

  మహిళా ఉద్యోగుల పై వేధింపుల వ్యవహారం ముఖ్య నాయకత్వానికి తెలిసినప్పటికీ ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరించడం వారి కిందిస్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించినట్లు గానే ఉంటుందనే వాదనలు కార్మిక వర్గం నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి . మహిళా కార్మికురాలు పై వేధింపులకు పాల్పడుతున్న ఫిట్ సెక్రెటరీ, ఇతర ముఖ్య నాయకుల పై కఠినంగా చర్యలు తీసుకొని వారిని యూనియన్ నుంచి బహిష్కరించాలని టీబీజీకేఎస్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, కార్మికవర్గం కోరుతుంది .

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadradri kothagudem, Karimnagar, Singareni, Singareni Collieries Company

  ఉత్తమ కథలు