(Srinivas P, News18, Karimnagar)
రాజన్న సిరిసిల్ల (Rajanna siricilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఓ వ్యవసాయ విస్తరణ అధికారి (Agricultural Extension Officer) చేతి వాటం ప్రదర్శించాడు . పండించిన పంటను ఆన్లైన్ లో నమోదు చేసేందుకు ఒక్కోపాస్ బుక్ (Passbook) కు రూ .500 వసూలుచేస్తున్నాడు . ఖచ్చితంగా ఇవ్వాల్సిందే లేకుంటే పని కాదు అని డైరెక్ట్ గానే చెపుతున్నాడు.. లంచాన్ని ఫోన్ పే , గూగుల్ పే (Google pay)ద్వారా ఎటువంటి జంకు లేకుండా తీసుకుంటున్నాడు. పై అధికారులకు కూడా తెలుసు అని చెపుతున్నాడు. రైతు భీమా నమోదు, రైతు భీమా చెల్లింపుల విషయంలో కూడా వేల రూపాయలు రైతుల వద్ద తిస్కుంటున్నట్లు తెలుస్తున్నది. పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎలాంటి మొహమాటం లేకుండా..
ఇదే విషయం రైతులను (farmers) అడగగా గత రెండు సంవత్సరాల నుంచి ఆ అధికారి ఆడిందే అట పాడిందే పాట అంటున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా డబ్బులు అడగటంతో రైతులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ రైతులు గోడును వెళ్లబోసుకున్నారు.
మీరు ఎవరితో చెప్పుకున్న పర్వాలేదు..
నిన్న ఇలాగే ఒక రైతు తన పాస్‌బుక్ ఇవ్వాలని అజీజ్ ఖాన్‌ను అడుగగా డబ్బులు ఇవ్వనిదే పని కాదంటూ మొహమాటం లేకుండా చెప్పాడు. మీరు ఎవరితో చెప్పుకున్న పర్వాలేదు అంటూ చెప్పిన మాటల్ని రైతు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో బండారం బయటపడింది.
కలెక్టర్ దృష్టికి రావడంతో..
సోషల్ మీడియా కథనంలో చూసి స్పందించిన జిల్లా కలెక్టరు అనురాగ్ జయంతి... తంగళ్లపల్లి మండలం తాడూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి అజీజ్ ఖాన్ సస్పెండ్ చేశారు. ఇలాంటి అవినీతికి పాల్పడే ఏ అధికారులను కూడా వదిలిపెట్టేది లేదని ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అవసరమైతే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. రైతులు ఎవరు కూడా ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇవ్వకూడదని ఎవరైనా డబ్బులు కోసం వేధిస్తే వెంటనే పోలీసులకు కానీ.. కలెక్టర్ కార్యాలయం నకు తెలి పి తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఓ పోలీసు కూడా..
గతంలో ఓ పోలీసు కూడా ఇదే పనిచేశాడు. ఇదే జిల్లాలోని గంభీరావుపేటకు చెందిన సింహాచలం తన ఇంటి అవసరాల కోసం ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని విడిచిపెట్టేందుకు రూ. 50వేలు డిమాండ్ చేశారు. రూ. 10వేలు ఇస్తానని అతడు చెప్పినా వినకపోవడంతో ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వల పన్నిన అధికారులు.. పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. సింహాచలం నుంచి కానిస్టేబుల్ కనకరాజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmer, Karimangar, Siricilla