P Rajendar, News18, Manchirial
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సెంటు భూమి ఉన్నా చాలనుకునే రోజులివి. పేదలు సొంత భూమి ఓ కల అనుకుంటుంటే.. పెద్దలు మాత్రం పేదల భూములపై గద్దల్లా వాడుతున్నారు. అదికార అండ ఉంటే ఆసంగతి వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా మంచిర్యాల జిల్లా (Manchirial District) లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లాలో తమకు ఇచ్చిన ఈనా భూములను కొంతమంది అధికార పార్టీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు నిరసన వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే కొందరు వారి పేరుపై పట్టా చేసుకోవడంపై భూభాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పేరుపై ఉన్న భూములను వేరే వారి పేరుపై ఎలా పట్టా చేస్తారని జైపూర్ తాసిల్దార్ని భూ బాధితులు నిలదీశారు.
గత 50 సంవత్సరాలుగా తమకి పట్టా ఇచ్చిన భూములలోనే ఇంటి నిర్మాణాలు చేపట్టి అక్కడే జీవనం సాగిస్తున్నామని.. అలాంటిది ఇప్పుడు ఆయా భూములను వేరే వారి పేరుపై ఎలా పట్టా చేస్తారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ భూములను ఖాళీ చేసి వెళ్లాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని.. ఏళ్లుగా ఉన్న ప్రాంతాన్ని వదిలి తాము ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేయాలంటూ జైపూర్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట భూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు న్యాయపోరాటం జరుపుతామని తెలిపారు. దీనిపై అధికారులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Local News, Mancherial, Telangana