హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: సూపర్​.. ఆ కాలేజీలోని 14 మంది మహిళా లెక్చరర్లూ అక్కడ చదివినవారే.. ఇదే వాళ్ల కథ..

Karimnagar: సూపర్​.. ఆ కాలేజీలోని 14 మంది మహిళా లెక్చరర్లూ అక్కడ చదివినవారే.. ఇదే వాళ్ల కథ..

కరీంనగర్​ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు

కరీంనగర్​ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు

చదివిన కాలేజ్లోనే లెక్చరర్స్ గా పని చేస్తే ఆ కిక్కే వేరు కదా . అదో గొప్ప అనుభూతి . అలాంటి సంఘటన ఒకటీ కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ , పీజీ కాలేజ్లో జరిగింది. ఒకరు కాదు .. ఇద్దరు కాదు .. ఏకంగా 14 మంది ఇలాగే లెక్చరర్స్ పని చేస్తున్నారు .

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Srinivas. P, News18, Karimnagar)చదివిన కాలేజ్లోనే లెక్చరర్స్ గా పని చేస్తే ఆ కిక్కే వేరు కదా . అదో గొప్ప అనుభూతి . అలాంటి సంఘటన ఒకటీ కరీంనగర్ (Karimnagar) ప్రభుత్వ డిగ్రీ , పీజీ కాలేజ్లో జరిగింది. ఒకరు కాదు .. ఇద్దరు కాదు .. ఏకంగా 14 మంది ఇలాగే మహిళా లెక్చరర్స్ (Women Lecturers) పని చేస్తున్నారు . 2008 లో ఏడుగురు , తర్వాత మరో ఏడుగురు బదిలీపై ఇక్కడికి వచ్చారు . 1987-2002 మధ్య వీరంతా ఇదే కాలేజ్లో డిగ్రీలు చేశారు . ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ.. 1987-2002 మధ్య కాలంలో మేం అందరం కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ (Karimnagar Women Degree and PG College) లో డిగ్రీ చేరాం.. అప్పుడు  అందరం వేరు వేరు గ్రూప్ లో ఉండేది.. లెక్చరర్ చెప్పే పాటలు సరిగ్గా విని ఎప్పటికప్పుడు హోం వర్స్​  కంప్లీట్ చేస్తూ డిగ్రీ పూర్తి చేసి పీజీ చదివి తరువాత డీఎల్ (DL) రాశాం. ఇప్పుడు మేమందరం డిగ్రీ లెక్చరర్స్ (Degree Lecturers) అయ్యాం.. కొద్ది రోజులు వేరు వేరు చోట్ల  పనిచేశాం. 2008 తరువాత మళ్ళీ మేం చదివిన కళాశాలలోకే లెక్చరర్స్ గా రావడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.
  శ్రద్ధ పట్టుదలతో చదివితే కానిదంటూ ఏదీ ఉండదన్నారు. ఈ జనరేషన్ ఆడపిల్లలు చదువుపై శ్రద్ధ వహించి  మంచి మంచి కొలువులు సాధించాలని కోరుతున్నామని తెలిపారు. ఇప్పుడున్న జనరేషన్ కు అన్ని వసతులున్నాయి  కాబట్టి, చదువు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యం వైపు గురి పెడితే తప్పకుండా కొలువులు సాధించవచ్చు అన్నారు. తమ రోజుల్లో ఆడపిల్లల్లో బిడియం ఉండేదని , ఇప్పుడు చురుగ్గా ఉన్నారని వీరు చెబుతున్నారు .


  టీఎస్పీఎస్సీ మరో జాబ్ నోటిఫికేషన్(Notification) ను విడుదల చేసింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులు (Applications) సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 10న దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.
  తెలంగాణలో ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించాయి. దీనిలో ముఖ్యంగా గురుకుల పోస్టులతో పాటు గ్రూప్ 3(Group 3) కింద 1373, గ్రూప్ 2(Group 2) కింద 663 పోస్టులు ఉన్నాయి. ఇటీవల మొత్తం 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్ రావు(Harish Rao) ప్రకటించిన విషయం తెలిసిందే.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Colleges, Karimnagar, Lecturer roles, Teaching

  ఉత్తమ కథలు