Home /News /telangana /

KARIMNAGAR ALL PARTIES ARE IN CONFUSION IN HUZURABAD BY ELECTIONS TO GET VOTES VRY KNR

Huzurabad by elections : అంతుచిక్కని ఓటర్ నాడి.. ఏ పార్టీ మీటింగ్‌కైనా.. పోటెత్తుతున్న ప్రజలు

Huzurabad by elections : అంతుచిక్కని ఓటర్ నాడి..

Huzurabad by elections : అంతుచిక్కని ఓటర్ నాడి..

Huzurabad by elections : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు... ఏ పార్టీ మీటింగ్‌ పెట్టినా.. వందల జనం వస్తుండడంతో అన్ని పార్టీలు తమ విజయం ఖాయమని చెబుతున్నాయి. అయితే పార్టీల సమావేశానికి వచ్చిన ప్రజలు ఎటువైపు ఓటు వేస్తారో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఇరు పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.

ఇంకా చదవండి ...
    కరీంనగర్ జిల్లా. న్యూస్ 18తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి.

    హుజరాబాద్ నియోజకవర్గంలో ( huzurabad ) జరుగనున్న ఉప ఎన్నికలో అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది . టీఆర్ఎస్ , బీజేపీలు ( trs, bjp ) ప్రచారంలో దూసుకెళ్తున్నాయి . ఇక్కడున్న సమస్య ఒక్కటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ( Eetala rajneder ) ఏ మీటింగ్ పెట్టిన వందలాదిగా జనాలు వస్తున్నారు . అధికార పార్టీ నాయకులు ఏ సభ పెట్టిన జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు .

    వందలాది ప్రజలు వస్తున్నా.. ఓటర్ నాడీ మాత్రం ఎవరికీ అంతు చిక్కడంలేదు . అధికార పార్టీ నాయనో భయానో బెదిరిస్తూ ప్రతిపక్ష నేతలను తమ పార్టీలోకి తీసుకు వెళ్తూ కింది స్థాయి నాయకత్వ ప్రతిపక్ష నేత ఈటల రాజేందర్‌ను ఒంటరి వాడిని చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తునప్పటికీ అధికార పార్టీ నుండి కూడా ప్రతిపక్ష పార్టీలోకి చిన్న పెద్ద తేడా లేకుండా నాయకులు బీజేపీలోకి ( BJP ) వలసలు పోతున్నారు .

    ఇది చదవండి : భార్యపై అనుమానం, బర్రెను వెతుకుదామంటూ తీసుకువెళ్లి.. బురదలో తొక్కాడు.. !

    అయితే.. వలసలు ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతాయో ఇప్పటికి అర్ధం కావడం లేదు . అధికార పార్టీ తను చేస్తున్న అభివృద్ధి పనులను నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ హుజరాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులు ప్రారంభించారు . వీటిలో అన్ని కుల సంఘలకు , స్థలాలు , భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు . నియోజకవర్గ ములోని ప్రతి గ్రామానికి సిసి రోడ్లు , మురికి కాలువల కోసం ప్రజలు అడిగిందే తడవుగా అధికార పార్టీ నిధులు మంజూరు చేస్తూ తెరాస అభ్యర్థిని గెలిపించాలని చెపుతున్నారు .

    మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది నిధుల విడుదలను ఉద్దేశించి మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిధులన్నీ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన నిధులని అప్పుడు తొక్కి పెట్టి ఇప్పుడు నిధులు మంజూరు చేసి ఏదో ఘనకార్యం చేశామని అధికార పార్టీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నాడు .

    ఇది చదవండి :  బాసరలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

    ఈ పరిణామాలతో ప్రస్తుత పరిస్థితుల్లో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడా ? ఈటల రాజేందర్ గెలుస్తాడా ?.. అనేది చర్చనీయాంశంగా మారింది . ఇప్పటివరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ప్రచారం ప్రారంభించలేదు . కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయడం టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావ్ అని , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మచ్చిక చేసుకొని అక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టాడని స్థానిక నాయకులు ప్రజలు చర్చించుకుంటున్నారు . ఈ పరిణామాలతో అధికార పార్టీ గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి .

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Huzurabad By-election 2021, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు