Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad By Election: ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం అనుకున్న ‘దళిత బంధు’తోనూ లాభం లేదని తెలిపోయిందో .. అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఫలితం ఎలా ఉంటుందో అర్థమైపోయింది . అందుకే ఆయన వ్యూహం మార్చారు. హుజూరాబాద్ రాజకీయాల నుండి కేటీఆర్ ను పక్కకు తప్పించారనే ప్రచారం సాగుతుంది.

 • Share this:
  (P. Srinivas, News18, Karimnagar) 

  ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం అనుకున్న దళిత బంధు(Dalitha Bandhu) తోనూ లాభం లేదని తెలిపోయిందో , అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఫలితం ఎలా ఉంటుందో అర్థమైపోయింది . అందుకే ఆయన వ్యూహం మార్చారు. హుజూరాబాద్ రాజకీయల నుండి కేటీఆర్ ను పక్కకు తప్పించారనే ప్రచారం సాగుతుంది. నిజానికి , ముందు నుంచి కూడా కేసీఆర్ హుజురాబాద్ పై ముందు జాగ్రత్తలు తీసుకున్నారు . ఓడిపోయినా , ఓటమి ముల్లు కేటీఆర్ కు గుచ్చుకోకుండా , హుజూరాబాద్ బాధ్యతలను హరీష్ అప్పగించారని అంటున్నారు . గెలిస్తే పార్టీ గెలుపు , అంటే కేసీఆర్ , కేటీఆర్ గెలుపు , ఓడితే హరీష్ రావు ఓటమి . కేటీఆర్ ఇన్ సేఫ్ జోన్ . ఆ విధంగా కేసీఆర్ స్కెచ్ వేశారని . ఆ ప్రకారంగానే కథ నడిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఏప్పుడైతే ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం టీఆరెఎస్ పార్టీ ఓటమి తధ్యమని తేలిపోయిందో .. అప్పుడు కేటీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికను శతకోటి ఉప ఎన్నికల్లో అదొకటి , అన్నట్లుగా హరీష్ రావు ఆరాటం మీద నీళ్ళు చల్లారు .

  Bathukamma: ఈ ఏడాది బతుకుమ్మ చీరలు ఎన్ని రంగుల్లో తయారు చేశారో తెలుసా.. వాటి డిజైన్లు ఇలా ఉన్నాయి..


  గెలిస్తే కేంద్రంలో అధికారం వస్తుందా.. ఓడి పోతే రాష్ట్రంలో అధికారం పోతుందా అంటూ .. హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపు ఓటములతో తనకు సంబంధం లేదని తేల్చేశారు కేటీఆర్ . లైట్ గా తీసుకున్నారు. గెలిచినా ఓడినా ఒకటే అన్నట్లుగా మాట్లాడి , ఆ ఒక్క సీట్లో గెలిచి మామ ముందు కాలర్ ఎగరేద్దామనుకున్న హరీష్ రావు గాలి తీసేశారు. ఒక వేళ రేపు పొరపాటున తెరాస గెలిచినా.. హరీష్ కు నెత్తిన కిరీటం పెట్టరు. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత.. అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ .. ఉప ఎన్నిక ఇప్పట్లో జరగదు అన్న కారణం చూపించి కేసీఆర్ దళిత బంధుకు బ్రేకులు వేశారు.

  Telangana News: వామ్మో.. ఏందిది.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దేవుడిని కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్..


  మరో నాలుగు మండలాలలో దళితబంధు అంటూ కొత్త ఎత్తుకు తెరతీశారు. ఉప ఎన్నికలు ఇప్పట్లో జరగవని తెలియడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారా లేక అటు ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చి , వెనకడుగువేస్తున్నారా అనేది ప్రశ్నార్ధకంగా మారిందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.

  కేసీఆర్ . కేటీఆర్ తమ చేతికి మట్టి అంటకుండా హుజూరాబాద్ ఉప ఎన్నిక రొంపిలోంచి బయట పడినా , హరీష్ రావు మాత్రం పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకు పోయారని ఆయన అభిమానులే అంటున్నారు. ఇప్పటికే దుబ్బాక ఓటమితో సగం ఇమేజి డ్యామేజి చేసుకున్న హరీష్ రావు .. హుజూరాబాద్ లోనూ ఓడిపోతే.. అక్కడితో ఆయన రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేనని.. పార్టీలోని అయన వర్గం ఆందోళన చెందుతోంది.

  TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ..


  హుజూరాబాద్ లో హరీష్ రావు కాలికి బలపం కట్టుకొని ప్రతీ ఇంటికి తిరిగి ప్రచారం చేస్తుంటే , హుజూరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా.. కేటీఆర్ పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నారని , కేసీఆర్ అన్ని రోజులు ఢిల్లీలో మకాం వేసింది అందుకే అన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా హరీష్ రావు మాత్రం ప్రతి రోజు హుజురాబాద్ లో తన వర్గం తో ప్రతిరోజూ కులసంఘాలతో.. అలాగే ప్రజలతో సభలు, సమావేశలు పెట్టి ప్రచారం మొత్తం తన భుజాలపైన వేసుకొని మరీ ప్రచారం చేస్తున్నాడు. చూడాలి మరి హరీష్ రావు పంతం నెగ్గి కాలర్ ఎగిరేస్తాడా.. లేదా దుబ్బాక సీన్ మరోసారి రిపీట్ అవుతుందో ఎన్నకల వరకు వేచి చూడాలి.
  Published by:Veera Babu
  First published: