KARIMNAGAR A YOUNG WOMAN WHO PRETENDS TO LOVE AND CHEATS ON A MAN IN KARIMNAGAR KNR VB
Bus Stand Love: బస్ స్టాప్ లో ప్రేమ.. ఆటోలో ప్రయాణం.. ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..
ప్రతీకాత్మక చిత్రం
Cheating Love: కరీంనగర్ నుండి బస్ లో వరంగల్ బయలుదేరాడు.. బస్టాండ్ లో దిగాడు రమేష్ అనే వ్యక్తి . అక్కడే ఓ మహిళని చూశాడు . ఇద్దరి చూపులు కలిశాయి . మత్తెక్కించిన మగువ కొంటె సైగలు చేయడంతో కోరిక పుట్టింది . అతగాడి కక్కుర్తి అర్థమైన మహిళ ఎంచక్కా ఎంజాయ్ చేద్దామనడంతో ఎగిరి గంతేశాడు. కళ్లు మూసుకుపోయి ముక్కూముఖం తెలియకపోయినా ఆమె వెంట వెళ్లిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే..
కరీంనగర్ నుండి బస్ లో వరంగల్ బయలుదేరాడు.. బస్టాండ్ లో దిగాడు రమేష్ అనే వ్యక్తి . అక్కడే ఓ మహిళని చూశాడు . ఇద్దరి చూపులు కలిశాయి . మత్తెక్కించిన మగువ కొంటె సైగలు చేయడంతో కోరిక పుట్టింది . అతగాడి కక్కుర్తి అర్థమైన మహిళ ఎంచక్కా ఎంజాయ్ చేద్దామనడంతో ఎగిరి గంతేశాడు. కళ్లు మూసుకుపోయి ముక్కూముఖం తెలియకపోయినా ఆమె వెంట వెళ్లిపోయాడు. ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది . ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది విటుడికి . ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో సడెన్ గా ఆమె భర్త ఎంట్రీ ఇచ్చాడు . ఇక కథ మామూలే . అతన్ని బెదిరించి డబ్బులు బ్యాగ్ పట్టుకుని కిలాడీ జంట అక్కడి చెక్కేసింది . లబోదిబోమంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు .
పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. ఈ నెల 23 వ తేదీన ఓ వ్యక్తి కరీంనగర్ నుంచి బస్సులో వరంగల్ వచ్చాడు . బస్టాండ్ లో ఓరగా చూస్తోన్న మహిళను చూసి జారిపోయాడు . అతన్ని నమ్మించిన మహిళ ఎంజాయ్ చేద్దామంటూ ఆటోలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లింది . ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో ముందస్తు ప్లాన్ ప్రకారం ఆమె భర్త ఎంట్రీ ఇచ్చాడు . కిలాడీ జంట అతనిపై దాడి చేసి రూ .70 వేలు ఉన్న బ్యాగును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు .
మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే వరంగల్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు సీరియగా రంగంలోకి దిగారు . సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి . రాయపురం సరిత ( 33 ) అనే మహిళ గతంలో బ్లాక్ టిక్కెట్లు విక్రయించేది . రేనికుంట్ల రాజేష్ ( 36 ) అలియాస్ గున్నని వివాహం చేసుకుంది . ఈజీ మనీ కోసం వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించేది .
అయినా వారి జల్సాలకు సరిపడకపోవడంతో కిలాడి లేడీ కన్నింగ్ ప్లాన్ వేసింది . యువకులకు వలపు వల విసిరి దోచుకోవాలని కంత్రీ స్కెచ్ గీసింది. అందులో భాగంగానే ఈ నెల 23 న బస్టాండ్ లో ఓ వ్యక్తిని ముగ్గులోకి దించి దోచుకెళ్లారు . మరొకసారి దోపిడీకి పాల్పడేందుకు నగరంలోకి వస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు . నగర శివార్లలో తనిఖీలు చేపట్టి బైక్ పై వస్తున్న కిలాడీ జంటను పోలీసులు అరెస్టు చేశారు .
నిందితుల వద్ద నుంచి రూ .58 వేల నగదుతోపాటు బైక్ , సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు . వారికి సహకరిస్తున్న మరో మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు . గతంలో వరంగల్ మినీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఒకరిని బెదిరించి దోపిడీ చేసిన ఘటనలో కిలాడీ జంటతో సహా నలుగురిని అరెస్టు చేసి జైలుకి పంపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.