హోమ్ /వార్తలు /తెలంగాణ /

Transgender Marriage: ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లాడిన యువకుడు..(వీడియో)

Transgender Marriage: ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లాడిన యువకుడు..(వీడియో)

అర్షద్, దివ్య (ట్రాన్స్ జెండర్)

అర్షద్, దివ్య (ట్రాన్స్ జెండర్)

ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిళ్లు పెరిగిపోయాయి. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రేమ జంటలు ఒక్కటవుతున్నాయి. తమ ప్రేమ కోసం పెద్దలను ఎదురించి మరీ మూడు ముళ్లతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు కులం, మతంతో సంబంధం లేని పెళ్లిళ్లు చూశాం. అలాగే వయసుతో సంబంధం లేని పెళ్లిళ్లు చూశాం. అలాగే వేరే దేశం అమ్మాయిలతో పెళ్లిళ్లు జరగడం చూసుంటాం. కానీ ఈ పెళ్లి వాటన్నింటికి మించి ప్రత్యేకమైంది. ఎందుకంటే ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అవును వినడానికి ఆశ్చర్యంగా వున్న ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ట్రాన్స్ జెండర్ ను ఆ యువకుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimnagar

(P.Srinivas,New18,Karimnagar)

ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిళ్లు పెరిగిపోయాయి. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రేమ జంటలు ఒక్కటవుతున్నాయి. ప్రేమ కోసం పెద్దలను ఎదురించి మరీ మూడు ముళ్లతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు కులం, మతంతో సంబంధం లేని పెళ్లిళ్లు చూశాం. అలాగే వయసుతో సంబంధం లేని పెళ్లిళ్లు కూడా చూశాం. అలాగే వేరే దేశం అమ్మాయిలతో తెలుగు వాళ్ల పెళ్లిళ్లు జరగడం చూసుంటాం. కానీ ఈ పెళ్లి వాటన్నింటికి మించి ప్రత్యేకమైంది. ఎందుకంటే ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అవును వినడానికి ఆశ్చర్యంగా వున్న ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ట్రాన్స్ జెండర్ ను ఆ యువకుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Indu Death: చిన్నారి ఇందు మృతిపై వీడని సస్పెన్స్..రంగంలోకి 10 బృందాలు

జగిత్యాల పట్టణానికి చెందిన అర్షద్ కారు డ్రైవర్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వీణవంకకు చెందిన దివ్య అనే ట్రాన్స్ జెండర్ ను చూసిన యువకుడు మనసు పారేసుకున్నాడు. దివ్యను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం యువకుడు ట్రాన్స్ జెండర్ అయినా దివ్య దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ దివ్య మాత్రం పెళ్ళికి నిరాకరించింది. ఈ క్రమంలో కొన్ని రోజులకు దివ్య వీణవంక నుండి వెళ్ళిపోయి జమ్మికుంటలో స్థిరపడింది. ఈ విషయం తెలుసుకున్న అర్షద్ జమ్మికుంటకు చేరుకున్నాడు. అక్కడ దివ్యను కలిసిన అర్షద్ నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అయితే మొదట పెళ్ళికి నిరాకరించిన దివ్య కూడా చివరకు అర్షద్ తో పెళ్లికి ఓకే చెప్పింది. ఇంకేముంది ఈ ఇద్దరు కుటుంబసభ్యుల మధ్యలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం ఇల్లంతకుంట రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Fire Accident : మంచిర్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

pic.twitter.com/1qbD18fEIx

— Hardin (@hardintessa143) December 16, 2022

ఆనందంలో అర్షద్..

ఇక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అర్షద్ ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్బంగా హర్షద్ మాట్లాడుతూ..నేను దివ్యను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాను. అందుకోసం ఆమెకు 3 సార్లు ప్రపోజ్ కూడా చేశాను. కానీ మొదట (దివ్య ట్రాన్స్ జెండర్) ఒప్పుకోలేదు. కానీ మరోసారి ఆమె వద్దకు పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. కొత్త జీవితంలో నూతన ఆశలతో తన జీవిత భాగస్వామి అయిన ఆమె దిశానిర్దేశం చేసిన విధంగా ముందుకు సాగుతానని అర్షద్ తెలిపాడు.

జీవితాంతం రుణపడి ఉంటా..దివ్య (ట్రాన్స్ జెండర్)

అర్షద్ కొంతకాలంగా నా వెంట పడుతున్నాడు. అయితే మొదట్లో అతనితో పెళ్లికి నేను అంగీకరించలేదు. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ అర్షద్ వచ్చి పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అర్షద్ నచ్చడంతో పెళ్లికి సిద్దమయ్యానని దివ్య అన్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన అర్షద్ కు జీవితాంతం రుణపడి ఉంటానని దివ్య పేర్కొన్నారు.

ట్రాన్స్ జెండర్ ను యువకుడు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అర్షద్, దివ్య  (ట్రాన్స్ జెండర్) పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

First published:

Tags: Karimnagar, Marriage, Telangana, Transgender

ఉత్తమ కథలు