Home /News /telangana /

KARIMNAGAR A YOUNG FARMER FROM KARIMNAGAR IS EARNING UP TO RS 5 LAKH WITH A CULTIVATION COST OF JUST RS 20000 HERE THE FULL STORY KNR PRV

Profitable Agriculture: సాగు ఖర్చు 20 వేలు.. చేతికొచ్చేది రూ. 5 లక్షలు.. ఓ యువరైతు వినూత్న వ్యవసాయం

కర్భూజ కాయలు

కర్భూజ కాయలు

ఈ రోజుల్లో వ్యవసాయం పేరెత్తితేనే యువత దండగ అనేస్తారు. అయితే సరిగా చేయాలేకానీ దానికంటే లాభాలు ఇచ్చే వ్యాపారం మరొకటి ఉండదు. కరీంనగర్​కు చెందిన ఓ యువరైతు అదే చేసి చూపించాడు.

    (Srinivas P, News 18, Karimnagar)

    అందరిలా కాకుండా భిన్నంగా పంటలు సాగు (Cultivation) చేయాలనుకున్నాడు ఈ యువరైతు (Young farmer). ఏటా యాసంగిలో రైతులు (farmers) ఎక్కువగా వరి , మొక్కజొన్న , నువ్వులు , పప్పు దినుసుల పంటలు సాగు చేస్తుంటారు . కానీ కరీంనగర్​లోని (Karimnagar) కథలాపూర్ మండలం దూలూరక్కు చెందిన గోపిడి ధనుంజయ్ రెడ్డి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు (Crop) సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు . ఈ ఏడాది ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా కర్బూజ కాయలు (Muskmelon) సాగు చేశాడు . కర్బూజ తోటకు నీళ్లు , శ్రమ తక్కువ ఉంటుందని ధనుంజయ్ రెడ్డి (Dhanunjay reddy) తెలిపాడు . విత్తనాలు (Seeds) నాటాక డ్రిప్ పైపులు ఏర్పాటు చేసి , అప్పుడుప్పుడు నీరందిస్తే సరిపోతుందని , ఒకసారి మొక్క ఎదిగితే 60 నుంచి 70 రోజుల్లో కర్బూజ కాయలు (Muskmelon) చేతికొస్తాయని చెప్పాడు. వేసవిలో మస్క్ మిలకు మంచి డిమాండ్ ఉండటంతో వాటిని హైదరాబాద్ (Hyderabad) , కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల్లోని పలు పట్టణాలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నాడు .

    100 క్వింటాళ్ల దిగుబడి..

    కిలోకు రూ .20 నుంచి రూ .30 మస్క్ మిలన్ విత్తనాలు , పురుగు మందుల పిచికారీ , కూలీల ఖర్చు , పంట చేతికొచ్చే వరకు మొత్తం రూ .20 వేలు ఖర్చయినట్లు ధనుంజయ్ రెడ్డి తెలిపాడు. ఎకరంలో (Acre) సాగు చేయగా 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నాడు. హోల్సల్గా పట్టణ ప్రాంతాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తే కిలోకు రూ .15 నుంచి రూ .20 ల వరకు , జ్యూస్ సెంటర్ల వారికి తామే నేరుగా కిలోకు రూ .40 నుంచి రూ .50ల వరకు విక్రయిస్తున్నట్లు చెప్పాడు . తాను సాగు చేసిన మస్క్ మిలన్ తోటను కథలాపూర్ మండలం లోని పలు గ్రామాల రైతులు సందర్శించారని తెలిపాడు.

    వేసవిలో WaterMelon ( పుచ్చకాయ ) కు భలే డిమాండ్ ఉంటది . ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ - బి , ఎ , బి 6 , కాల్షియం , సోడియం , మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు . వేసవిలో మనం ఎక్కువగా డీహై డ్రేషన్ కు గురవుతుంటాం . అలాంటి సమయంలో వాటర్ మిలన్ చేసే మేలు మరేదీ చేయదు .

    బిజినెస్ ఐడియాస్ లో మరో లాభదాయక వ్యాపారం గురించి చర్చిద్దాం. ఇప్పటికే బిజినెస్ ఐడియాస్ ద్వారా ఎంతో మంది యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు కదులుతున్నారు. అయితే ఫుడ్ బిజినెస్ రంగంలోని మరో అవకాశం గురించి తెలుసుకుందాం. కోడిగుడ్ల వ్యాపారం అని చీప్‌గా చూడొద్దు. ఇది నిరంతరం ఆదాయ వనరుగా ఉంది. సీజన్ తో సంబంధం లేకుండా కోడిగుడ్లను అందరూ వినియోగిస్తారు. పైగా వీటి డిమాండ్ కూడా ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ఎగ్ బిజినెస్ మోడల్ లో మనం చేయాల్సింది. హోల్ సేల్ డీలర్ల వద్ద కోడిగుడ్లను కొనుగోలు చేసి, వాటిని కిరాణా షాపులు, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ కు సప్లై చేసే ఎగ్ సప్లయర్ వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Agriculture, Farmer, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు