(Srinivas P, News 18, Karimnagar)
జగిత్యాల (Jagityala) జిల్లా మాల్యాల తహశీల్దార్ సుజాత (Malyala Tahsildar Sujatha)కు ఏసీబీ అధికారులం అంటూ వచ్చిన ఫోన్ కాల్ (Phone call) జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బుధవారం మధ్యాహ్న సమయంలో 9908997822 నంబరు ద్వారా తహశీల్దార్ సుజాతకు ఫోన్ చేసి (Call to Tahsildar).. మీపైన అవినీతి ఆరోపణలు వచ్చాయని 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. ఫోన్ కాల్ (Phone call)తో ఖంగుతిన్న తహశీల్దార్.. తనపైన ఎలాంటి ఆరోపణలు లేవని కావాలంటే విచారణ జరుపుకోవాలని ఫోన్ లోనే సమాధానం చెప్పారు. అయితే అంతకు ముందు సదరు ఫోన్ కాల్ (Fake call) చేసిన వ్యక్తి మల్యాల ఎస్ఐ చిరంజీవికి ఫోన్ చేసి తాను ఏసీబీ.. DSP అని.. మీ మండల తహశీల్దార్ ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగాడట. దీంతో ఎస్ఐ ఫోన్ లో.. తహశీల్దార్ సుజాత నంబర్ ఇచ్చాడు.అనంతరం తహశీల్దార్ కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు.
10 లక్షలు డిమాండ్..
అదే సమయంలో సదరు వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు (Money) అడిగినట్టు తహశీల్దార్ తెలిపారు. తను ఎమ్మెల్యే ప్రోగ్రాం (MLA Program) లో ఉన్నానని చెప్పిన కూడా ఫోన్ కాల్ లోని వ్యక్తి.. తన భర్త నంబర్ ఇవ్వమని పలుమార్లు అడగడంతో నంబర్ ఆమె భర్త నంబర్ ఇచ్చారు. సదరు వ్యక్తి.. తహశీల్దార్ భర్తకు ఫోన్ చేసి 10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపింది. దీంతో సాయంత్రం సమయంలో తనకు వచ్చిన ఫేక్ బెదిరింపు కాల్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు తహసీల్దార్.
గతంలోనూ ఇలాంటి ఫోన్‌కాల్స్..
ఇలా మండల ఉన్నత స్థాయి అధికారులకే ఫోన్ చేసి (Call to Tahsildar) డబ్బులు డిమాండ్ చెయ్యడం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న కూడా మంచిర్యాల కలెక్టర్ పేరు చెప్పి కూడా డబ్బులు వసూలు చేసి నా సంఘటనలు కూడా ఉన్నాయి. వారం కిందట కూడా మహబూబ్‌నగర్ లో కూడా ఉన్నత అధికారులకు ఫోన్ చేసి డబ్బులు అడిగినా సంఘటన మరిచిపోకముందే తెరపైకి ఈ సంఘటన రావడంతో ప్రభుత్వ అధికారులలో ఫేక్ కాల్స్ భయం పట్టుకుంటుంది.
జల్సాల కోసం అలవాటుపడిన కేటుగాళ్లు ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఇలాంటి ఫేక్ కాల్ చేసి బెదిరించి ఎంతటివరైనా వదిలిపెట్టేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వెంబడి నిందితున్ని పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. ఇలా ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ఉన్నత అధికారులకు ఇలాంటి ఫేక్‌కాల్స్ రావడం జిల్లాలో కలకలం సృష్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheating, Crime news, Fake id, Karimangar