Home /News /telangana /

Shocking: వాళ్లిద్దరు భార్యాభర్తలు.. కానీ ఆ చిన్న కారణానికి అతడు ఆమెను నడిరోడ్డుపై ఏం చేశాడో తెలుసా..

Shocking: వాళ్లిద్దరు భార్యాభర్తలు.. కానీ ఆ చిన్న కారణానికి అతడు ఆమెను నడిరోడ్డుపై ఏం చేశాడో తెలుసా..

దంపతులు

దంపతులు

Shocking భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజం. ఒక రోజు ఇలా గొడవలు పెట్టుకుంటే.. మరో రోజు కలిసిపోయి ఉంటారు. ఇలా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ.. చిలుకా, గోరింకలా జీవితాన్ని గడుపుతారు. అయితే ఇక్కడ చెప్పు ఘటనలో.. వాళ్లిద్దరు భార్యాభర్తలు. కొన్ని సంవత్సరాల క్రితం పెళైంది.

ఇంకా చదవండి ...
  భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజం. ఒక రోజు ఇలా గొడవలు పెట్టుకుంటే.. మరో రోజు కలిసిపోయి ఉంటారు. ఇలా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ.. చిలుకా, గోరింకలా జీవితాన్ని గడుపుతారు. అయితే ఇక్కడ చెప్పు ఘటనలో.. వాళ్లిద్దరు భార్యాభర్తలు. కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఇటీవల కాలంలో వాళ్లిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఒకరంటే..ఒకరు తీవ్రంగా దూషించుకునేవాళ్లు. ఇంట్లో అయితే విలువైన సామాన్లు ఎన్ని పగిలిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా వారిద్దరి మధ్య గొడవ చివరకు చినుకు చినుకు గాలివానలా మారినట్లు పెరిగి పెద్దదైంది. వీరి వ్యవహరం చివరకు పెద్ద మనుషుల వద్దకు వెళ్లింది. వీళ్లిద్దరిని పెద్దమనుషుల వద్ద నిలబెడ్డారు.

  Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


  పెద్ద మనుషులు పంచాయతీ చేస్తున్నారు. గొడవలు అనేవి సాధారణంగా వస్తాయి.. కానీ.. నాలుగు గోడల మధ్య ఉంచి.. బయటకు రాకుండా చూసుకోవాలని.. ఇంటి నుంచి ఊరి బయటకు వచ్చిందంటే.. పెద్ద మనుషుల వరకు వస్తుందని చెప్పారు.ఇక నుంచి గొడవలు పెట్టుకోకుండా.. హాయిగా కాపురం చేసుకోండి అంటూ తీర్పు ఇచ్చారు. అయితే దానికి అతడి భార్య మాత్రం ససేమిరా అంది. అతడితో ఎట్టి పరిస్థితుల్లో కాపురం చేయను అని తెగేసి చెప్పేసింది. అస్సలు అతడితో కలిసి ఆ ఇంట్లో కూడా ఉండను అంటూ.. పెద్ద మనుషుల ముందే చెప్పేసి..అక్కడ నుంచి బయలుదేరింది.

  Comedian Raghu Karumanchi: మద్యం అమ్ముతున్న కమెడియన్ రఘు.. కారణం ఏంటో తెలుసా..


  ఇక ఆమె భర్తకు పట్టరాని కోపం వచ్చింది.. తన మాట వినక.. పెద్ద మానుషుల మాట వినక ఇలా వెళ్లిపోవడం అతడికి అస్సలు నచ్చలేదు. అంతే కాకుండా.. పంచాయతీలో తన పరువుపోయిందని భావించాడు. ఆమె వెంట పడి.. ఆమెను వెంబడించాడు. ఎలాగోలా ఆమెను పట్టుకొని.. చేతితో బండరాయి తీసుకొని ఆమె తలపై కొట్టాడు. ఆమె అక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఈ విధంగా తెలిపారు.

  Anchor Sreemukhi: ప్యాంట్ లేకుండా యాంకర్ శ్రీముఖి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..


  ఆమకు 35 ఏళ్లు. ఆమె పేరు రేణుక. ఉప్పట్ల గ్రామానికి చెందిన ఈమె.. అదే గ్రామానికి చెందిన వ్యక్తితో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేశారు. కొన్ని సంవత్సరాల వరకు బాగానే ఉన్నా.. గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్ర‌మంలో గొడ‌వ‌లు మ‌రింత ముద‌ర‌డంతో శ‌నివారం పెద్ద మ‌నుషుల మ‌ధ్య పంచాయ‌తీ పెట్టారు. పంచాయ‌తీ జ‌రుగుతుండ‌గా రేణుక‌ తాను భ‌ర్త‌తో కాపురం చేసేది లేద‌ని తెగేసి చెప్పింది.

  Online Payments: ప్రతీది ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నారా.. వారి కోసం గూగుల్ కీలక ప్రకటన.. తప్పక తెలుసుకోండి..


  ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి వెళ్లిపోతుండ‌గా ఆగ్ర‌హించిన భ‌ర్త ఓ బండ‌రాయి తీసుకుని ఆమెను వెంబ‌డించాడు. ఆమె దొర‌క‌గానే త‌ల‌పై బండ‌రాయితో కొట్టి హ‌త్య‌చేశాడు. ప‌ట్ట‌ప‌గ‌లు నడివీధిలో దారుణ హత్య జ‌రుగ‌డంతో గ్రామంలో క‌ల‌క‌లం చెల‌రేగింది. గ్రామ‌స్తుల ద్వారా స‌మాచారం అందుకున్న మంథ‌ని పోలీసులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Karimangar, Manthani, Telangana crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు