Home /News /telangana /

KARIMNAGAR A LOVER TRIED TO SEXUALLY ASSAULT A YOUNG WOMAN WHO APPEARED ALONE AT HOME VB

Telangana Crime: ఒంటరిగా ఉన్న యువతిపై కన్నేసిన కామాంధుడు.. ఇంట్లోకి చొరబడి.. ఆమెను బలవంతంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Crime: ఇంట్లో ఒంటరిగా కనిపించిన ఓ యువతిపై లైంగికదాడికి యత్నించాడు ఓ కామాంధుడు. ఆమె ప్రతిఘటించడంతో పురుగులమందు నోట్లో పోసి ఆమె ప్రాణాలు బలి తీయపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి మంథని మండలం ఖానాపూర్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    భారతదేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కోవలోకి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఆమె నిరాకరించడంతో నోట్లో పురుగుల మందు పోసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ తండ్రి రావడంతో అతడు అక్కడ నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించి సీఐ సతీశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

    పెద్దపల్లి మంథని మండలం ఖానాపూర్ లో తండ్రీ కూతురు కలిసి ఉంటున్నారు. ఉదయం ఆమె తండ్రి పొలం పనులకు వెళ్లారు. ఇదే అదునుగా భావించి అదే గ్రామానికి చెందిన సతీశ్ అనే యువకుడు ఆ మహిళ ఒంటరిగా ఉండటం చూసి ఇంట్లోకి చొరబడ్డాడు. లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె దానికి నిరాకరించి ప్రతిఘటిస్తుండగా పురుగులమందు నోట్లో పోసి ఆమె ప్రాణాలు బలి తీయపోయాడు. ఆ సమయంలోనే బాధితురాలి తండ్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరేసరికి లోపలి నుంచి అరుపులు వినిపించాయి. తన కూతురును అదే గ్రామానికి చెందిన మంథని సతీశ్ బలాత్కరిస్తూ కనిపించాడు. ఆమె ప్రతిఘటించడంతో నోట్లో పురుగుల మందు పోసేందుకు ఆ యువకుడు ప్రయత్నిస్తున్నాడు.

    Also Read: ఇంట్లో ఒంటరిగా 15 ఏళ్ల బాలిక.. ఇంట్లోకి పురుగులు వస్తున్నాయంటూ లైట్ ఆర్పేయమన్నాడు ఎంపీటీసీ.. బాలికపై..


    ఆమె తండ్రి గమనించి కర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా యువకుడు తప్పించుకుని పారిపోయాడు. కర్ర దెబ్బ కూతురు తలకు తాకడంతో బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని యువతిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Karimnagar, Minor girl, Peddapalli, RAPE, Sexual harrassment

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు