హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: స్నేహితుడు ఇవ్వాల్సిన డబ్బు కోసం 13 రోజులుగా ఇంటి ముందు నిరాహార దీక్ష.. చివరికి.. 

Karimnagar: స్నేహితుడు ఇవ్వాల్సిన డబ్బు కోసం 13 రోజులుగా ఇంటి ముందు నిరాహార దీక్ష.. చివరికి.. 

సతీష్​ ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంపత్ కుటుంబ సభ్యులు

సతీష్​ ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంపత్ కుటుంబ సభ్యులు

సంపత్​ అనే వ్యక్తి తన స్నేహితుడికి అవసరానికి అప్పు ఇచ్చాడు. ఆ స్నేహితుడు బిజినెస్​ చేసి సెటిలయ్యాడు. తీరా సంపత్​ డబ్బులు అడగ్గా ముఖం చాటేశాడు. దీంతో జరగరాని ఘోరం జరిగిపోయింది.

(శ్రీనివాస్. పి న్యూస్ 18, కరీంనగర్)

ఓ గ్రామంలో స్నేహం అనే పదానికి కళంకం తెచ్చే విధంగా ఓ స్నేహితుడు (Friend) వ్యవహరించాడు. బాధిత ఈరెల్లి సంపత్ (Sampath) అనే యువకుడు స్నేహితుని ఇంటి ఎదుటే గత  13 రోజుల నుంచి నిరాహార దీక్ష చేసి  మృతి చెందాడు. కరీంనగర్ (Karimnagar) జిల్లా శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామానికి చెందిన ఈ రెల్లి సంపత్, శనిగరపు సతీష్ (Sathish) అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఈ రెల్లి సంపత్ అనే యువకుడు వృత్తిరీత్యా ఒగ్గు కథలు చెప్పుకొని ,తన భార్య లలిత, కుమార్తె సహస్రను  పోషించుకుంటూ ఉన్నాడు. కొన్ని ఏళ్ల క్రితం శనిగరపు సతీష్,  సీడ్, వరి ధాన్యం వ్యాపారం (Business) చేస్తా అంటూ ఈ రెల్లి సంపత్ వద్ద సుమారు 30 లక్షలు అప్పుగా (lending Money) తీసుకున్నాడు. సతీష్​ వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు సంపత్ కుటుంబ సభ్యులు డబ్బులు అడిగారు. అయితే మెట్ పల్లి పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించగా శనిగరపు సతీష్, ఈరెల్లి సంపత్ కు 17 లక్షలు ఇవ్వాల్సిందిగా తీర్మానం (Decide) చేశారు.

2, 3 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా..

అప్పులో భాగంగా సతీష్ తల్లిదండ్రులకు చెందిన కొంత భూమిని 12 లక్షల రూపాయలకు సంపత్  కు అప్పగించారు . మిగిలిన 7 లక్షల బాకీ డబ్బులు ఇవ్వాలని  సతీష్ ను కోరగా 2, 3 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నాడు. బాకీ డబ్బులు  ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో, మనస్తాపానికి గురైన ఈ రెల్లి సంపత్ అనారోగ్యం పాలయ్యాడు. మరోవైపు ఆర్థికంగానూ సంపత్​ నష్టపోయాడు.

వైద్య ఖర్చుల కోసం డబ్బులు..

అయితే రోజురోజుకు సంపత్ ఆరోగ్యం క్షీణించడంతో ఖర్చులు అధికమయ్యాయి. దీంతో ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్య ఖర్చుల కోసం డబ్బులు కావాలంటూ  గత 13 రోజుల క్రితం బాధిత కుటుంబం సతీష్​ను అడిగింది. సతీష్​ స్పందించకపోవడంతో  సతీష్ ఇంటి ఎదుట సంపత్ నిరసన చేపట్టాడు. డబ్బులిచ్చే వరకు కదిలేది లేదని కూర్చున్నాడు. అయితే ఎంతకీ సతీశ్​ డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన సంపత్​ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కేసు విచారణ చేస్తున్నారు.  సంపత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గతంలోనూ సంగారెడ్డిలో ఓ ఘటన జరిగింది.  కష్టాల్లో ఉన్నారని తెలిసి ముగ్గురు మిత్రులకు దాదాపు రూ.40 లక్షలు అప్పుగా ఇచ్చాడు మధుసూదన్​ రెడ్డి. డబ్బులు తీసుకొని ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎప్పుడిస్తారని పదే పదే ఫోన్‌లు చేశాడు. అంతే స్నేహితుడు ఒత్తిడి చేయడంతో ఆ ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాలేదు. చంపేద్దామా.. అని వారిలో ఒకరు సలహా ఇచ్చారు. అంతే ఆ ప్లాన్‌నే అమలు చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న స్నేహితుడినే దారుణంగా చంపేశారు. సంగారెడ్డిలో ఈ దారుణం జరిగింది. హైదారబాద్‌ పాతబస్తీకి చెందిన వ్యాపారిని అతడి స్నేహితులే కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ పొలంలో పూడ్చి పెట్టారు.

First published:

Tags: Attemp to suicide, Friendship, Karimangar

ఉత్తమ కథలు