సుల్తానాబాద్ కరోనా ఐసొలేషన్ సెంటర్ ఆస్పత్రి ఆవరణలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారా.. లేక ఆస్పత్రి సిబ్బంది నిప్పు పెట్టారా.. అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆస్పత్రికి సంబంధించిన వాటర్ పైపులు, కరెంటు మోటారు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంపై ఆసుపత్రి వర్గాలను వివరణ అడగ్గా తమకేమీ తెలియదంటూ సమాధానం ఇచ్చారు. కరోనా పేషెంట్లకు సమీపంలోనే ఈ అగ్నిప్రమాదం జరిగింది. విపరీతమైన పొగతో కరోనా పేషెంట్లకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఐసోలేషన్ కేంద్రంలో 30 మంది వరకు కోవిడ్ బాధితులు ఉన్నారు. ఆస్పత్రి ఆవరణలోని బావి నీటిని ఐసోలేషన్ కేంద్రానికి వాడతారు. అగ్ని ప్రమాదంపై ఆసుపత్రి వెనకభాగంలో ఉన్న వైద్య సిబ్బంది ఎవరు పట్టించుకోలేదు. కవరేజికి వెళ్లిన మీడియా తో పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.
సుల్తానాబాద్ కరోనా ఐసోలేషన్ సెంటర్లో రక్షణ కరువైందని పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని కరోనా రోగులు వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరికీ కి ఎలాంటి ప్రమాదం జరగక పోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona patients, Fire Accident, ISOLATION CENTER, Peddapalli