Home /News /telangana /

KARIMNAGAR A FATAL ACCIDENT TOOK PLACE WHEN AN RTC BUS AND A LORRY COLLIDED IN JAGITYALA DISTRICT KNR PRV

Bus Accident: జగిత్యాలలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. పూర్తి వివరాలివే..

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుని లారీ ఢీకొట్టింది.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుని లారీ ఢీకొట్టింది.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుని లారీ ఢీకొట్టింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India
  తెలంగాణలోని జగిత్యాల- కరీంనగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. జగిత్యాల (Jagityal) జిల్లాలోని మల్యాల మండలం రాజారాం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కృష్ణ, బస్సులో ప్రయాణిస్తున్న ముత్తమ్మ (68) ఉన్నారు. బస్సు కరీంనగర్ వైపు నుంచి జగిత్యాలకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మల్యాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

  గాయపడిన వారికి ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించారు. ఇక, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.  కాగా, జగిత్యాలలో గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. 2018 సెప్టెంబర్​లో కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 65 మంది మృతిచెందారు.  దీంతో ఘటనకు బాధ్యున్ని చేస్తూ జగిత్యాల ఆర్టీసీ డీఎం హనుమంతరావుపై ప్రభుత్వం వేటు వేసింది.

  అంతేకాకుండా జిల్లాలోని రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో గల చిన్నగట్టు వద్ద శనివారం రాత్రి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు (Car Fell into Well)) దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న మల్యాల మండలానికి చెందిన చందు తన నలుగురు మిత్రులతో కలిసి శ్రీరాముల పల్లెకు బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చిన్న గట్టు సమీపంలో గల వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. అయితే కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు సురక్షితంగా బయటపడగా చందు ఫ్రెండ్ కిషోర్ కారులో గల్లంతయ్యాడు. కారును క్రేన్ సాయంతో సుమారు 6 గంటల రెస్క్యూ అనంతరం బయటకు తీశారు. గల్లంతైన కిషోర్ మృతి చెందగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

  ఇలా కారు అదుపు తప్పి బావిలో పడిపోయిన ఘటనలు గతంలోనూ జరిగాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామడి మండలంలోని చిన్న ముల్కనూర్ దగ్గరలో కారు బావిలోకి దూసుకెళ్లింది. బావి లో నుంచి కారు ను బయటకు తీసిన గజ ఈతగాళ్లు కారులో ఒక మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆ శవం భీమదేవరపల్లి మండలానికి చెందిన రిటైడ్ ఎస్సై పాపయ్య నాయక్ మరియు భీమదేవరపల్లి మండల వాసిగా గుర్తించారు. ఉదయం 11 గంటలకు చిన్న ముల్కనూరు బావిలో పడిన కారు తొమ్మిది గంటలపాటు శ్రమించి కారు ను రెస్క్యూ టీం బయటకు తీశారు. అప్పటివరకు అంత బాగానే ఉంది. అప్పటి వరకు మృతదేహం కోసం వెతుకుతున్నారు. అయితే విగతజీవిగా బావిలోంచి బయటపడ్డ మృతదేహం అన్నది కావడం.. మృతదేహం కోసం వెతికే వ్యక్తి తమ్ముడు కావడం ఇక్కడ విచారకరం.
  First published:

  Tags: Bus accident, Karimnagar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు