(జగిత్యాల జిల్లా, న్యూస్ 18 తెలుగు, కరస్పాండెంట్. శ్రీనివాస్. పి)
పంటలు పండించడం ద్వారా ఆదాయం పొందడమన్నది కష్టంతో కూడుకున్నదే . కానీ సాగుతోపాటు అనుబంధ రంగాల వైపు దృష్టిసారిస్తే అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చంటున్నాడు జగిత్యాల రూరల్ (Jagityal) మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు ఎడ్మల మల్లారెడ్డి (Mallareddy) . సమగ్ర వ్యవసాయ పద్ధతులతో ఓవైపు పంటలు పండిస్తూనే, మరోవైపు తేనెటీగల పెంపకం (Beekeeping)తో మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు . హైదరాబాద్ నుంచి బాక్స్లు తెప్పించి .. పలు పంటల్లో అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శ రైతుగా పేరుగాంచిన మల్లారెడ్డి .. రైతు నేస్తం సంస్థ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం (Beekeeping)పై శిక్షణ తీసుకున్నాడు. అన్ని విషయాలపై పట్టు సాధించి , తన వ్యవసాయ భూమిలో సొంతంగా తేనెటీగల పెంపకం చేపట్టాడు. 7 నుంచి 10 అరలు ఉండే తేనెటీగలు నివసించేందుకు చెక్క బాక్సులను హైదరాబాద్ నుంచి తెప్పించాడు . ఒక్కోదానికి రూ .4,500 వెచ్చించాడు. ప్రస్తుతం 12 బాక్సులతో తేనె ఉత్పత్తి చేస్తున్నాడు . ఒక్కో బాక్స్ నుంచి 4 నుంచి 5 కేజీల తేనె ఉత్పత్తి చేస్తున్నాడు .తన తోట వద్దకు వచ్చే వినియోగ దారులకు నేరుగా విక్రయిస్తున్నాడు. మరో 10 బాక్స్ కోసం ఆర్డర్ పెట్టినట్లు తెలిపాడు. రైతులే కాకుండా నిరుద్యోగులు ఏడాది పొడవునా తేనే తీగల పెంపకం చేపట్టి తేనె తయారు చేసి , ఉపాధి పొందే అవకాశం ఉందని కుడా రైతు మల్లారెడ్డి న్యూస్ 18 వివరించాడు.
సాధారణంగా తేనెటీగలు (bees) పుప్పొడి రేణువుల ద్వారా తేనె తయారు చేస్తాయి . ఇందుకోసం పుష్పించే తోటలు అనుకూలం. మల్లారెడ్డి తాను పంటలు పండించినప్పుడు తన భూమిలోనే , లేదంటే ఆవాలు , నువ్వులు , పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటలు ఎక్కువగా ఉండేచోట బాక్స్ లను ఏర్పాటు చేస్తారు . బాక్స్ ఒక్కో అరగది ) కు రాణి ఈగలు , పోతు ఈగలు , కూలీ ఈగలు ఉంటాయి . వీటి జీవిత చక్రం 21 రోజులు . ఇవి ఎల్లప్పుడూ గుడ్లు పెడుతూ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. కూలీ ఈగలు బాక్స్ నుంచి బయటకు వెళ్లి పువ్వుల్లోని పుప్పొడిని తినేంత తిని , తర్వాత కొంతవరకు బాక్స్ లోకి తీసుకొస్తాయి.
తేనే తయారీకి అవసరమైన తేనె తుట్టె ( మైనం ) ను తయారు చేస్తాయి . ఇలా 15 రోజులపాటు కూలీ ఈగలు బయటకు వెళ్లడం, రావడం చేస్తాయి. నెల రోజుల్లో తేనె తుట్టె నిండి , ప్రతీ బాక్స్ తేనె (Honey) తయారవుతుంది. తర్వాత , బాక్సులో ఉండే అరను పక్కకు తీసుకెళ్లి తేనెను వడపోయాలి . ఇలా వాడపోసిన తేనెను నేరుగా మార్కెట్ లోకి తీసుకెళ్లి అమ్మవచ్చని అని రైతు మల్లారెడ్డి అంటున్నాడు. ఎలాంటి కల్తీ లేని తేనే (Honey) కాబట్టి మార్కెట్ లో కుడా మంచి ధరపలకుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు రైతు.
ఐరోపా రకం తేనెటీగలు..
తేనెటీగల్లో నాలుగైదు రకాలు ఉన్నాయి . మల్లారెడ్డి ఐరోపా రకం తేనెటీగలను పెంచాడు . బయటకు వెళ్లిన తేనెటీగ (Bee) మకరందం పీల్చుకొని మళ్లీ అదే బాక్సులోకి వస్తుం ది . దారి తప్పి వేరే బాక్సులోకి వెళ్తే మిగతావి చంపేస్తాయి. పుప్పొడి కోసం ఒక్కో తేనెటీగ 2 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తుంది. రసాయనాలు వినియోగించే తోటల్లోకి వెళ్తే చనిపోతాయి . అందుకని సేంద్రియ పద్ధతిలో పెంచే పంటల్లోనే తేనెటీగలను (bees) పెంచడం మంచిది . బాక్స్ సగం నిండిన తర్వాత జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి తేనె తీయాలి. మిగతా బాక్స్ ఉన్న తేనె టీగలకు (bees) ఏమాత్రం అనుమానం వచ్చినా, అలజడి రేగినా , అవి తయారు చేసిన తేనెను అవే తాగుతాయి. పుప్పొడి దొరకని కాలంలో బాక్సులోనే చక్కెర కలిపిన నీరు , పాలపొడి , మినుపపొడితో కూడిన నీరు ఉంటే తేనెటీగలు తాగి తేనె ఉత్పత్తి చేస్తాయి .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Honey, Karimnagar