(P.Srinivas,New18,Karimnagar)
కరీంనగర్ లో మనీ లాండింగ్ వ్యాపారం, రుణగ్రహీతలను బెదిరించడం, తన అనుచరుల పేర్లతో వారి ఆస్తులను ఆక్రమించడం వంటి చర్యలు, తన సహచరులతో కలిసి అధిక వడ్డీలకు అక్రమంగా రుణాలివ్వడం, మోసపూరితంగా, బలవంతంగా, భూకబ్జాలకు బెదిరింపులకు రుణగ్రహీతలను వేధింపులకు పాల్పడి, గురి చేయడం లాంటి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడిన కరీంనగర్ కు చెందిన ఏఎస్ఐ బి.మోహన్ రెడ్డి , ASI / 760 ( U / s ), సిద్దిపేట కమిషనరేటు, గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇతని పై మోపబడిన అభియోగాలపై APCS ( CC ) యొక్క రూల్ 20 ప్రకారం మౌఖిక విచారణ జరిపి సర్వీస్ నుండి తొలగించడం జరిందని డిఐజి వి.సత్యనారాయణ తెలిపారు.
కరీంనగర్లోని బోయవాడ వీధిలో చట్ట విరుద్ధంగా ఎటువంటి రెజిస్ట్రేషన్ లేకుండా ఒక ఫైనాన్స్ కార్యాలయాన్ని స్థాపించి అట్టి ఫైనాన్స్ ద్వారా మని లాండరింగ్ ఆక్ట్ 1349 IN AP ఫైనాన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1995, నిబంధనలను ఉల్లంగించి ఋణం ఆశించి తన వద్దకు వచ్చిన వారికి పెద్దమొత్తంలో ఋణం ఇస్తూ వారి ఆస్తులను తన అనుచరులకు అందచేస్తాడు. అంతేకాకుండా sale cum GPA ద్వారా తన తండ్రి ( బి . ఆది రెడ్డి ), తన భార్య (బి . లత), అతని బావ శ్రీధర్ రెడ్డి లను చేర్చు కొని అట్టి ఆస్తులను ఎవరికైనా విక్రయించడానికి పూర్తి హక్కులను పొందుతాడు అలాగే అప్పు ఇచ్చే అండ్ సమయంలో అప్పు తీసుకున్నవారి నుండి ఖాళీ చెక్కులు ఖాళీ ప్రామిసరీ నోట్లు / తెల్ల కాగితాలు సంతకాలతో తీసుకునేవాడు. అతను 3 నుండి 5 % చొప్పున వడ్డీకి డబ్బు ఇస్తాడు . లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నప్పుడు మనీ లెండింగ్, రామవరపు ప్రసాదరావు (Ken Crest అనే విద్య సంస్థ అధిపతి ) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇట్టి అభియోగం మోపబడిన వ్యక్తి, క్రమశిక్షణా కలిగిన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగి గా ఉండి, తన అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ..ల్యాండ్ ఆక్రమణలో మునిగిపోయాడని స్పష్టంగా కోర్ట్ నిర్ధారించబడింది. అతని సహచరులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి, రుణ మొత్తాలను తిరిగి చెల్లించాలంటూ వేధించేవారు. ఇతని మరియు ఇతని అనుచరుల చర్యల వలన రామవరపు ప్రసాదరావు మరణానికి కారణమైన ఈ వ్యక్తి వల్ల పోలీసు శాఖకు చెడ్డ పేరు వచ్చి, సామాన్య ప్రజల దృష్టిలో పోలీసుల ప్రతిష్టను దిగజార్చడం జరిగినది. ఇతని పై మోపబడిన అభియోగాలపై , అతని దుష్ప్రవర్తన పైన అన్ని ప్రాంతీయ వార్తా ఛానెల్లలో విస్తృతంగా ప్రసారం చేయబడింది. పోలీసులు ప్రతిష్టను దెబ్బతీసేలా అన్ని వార్తాపత్రికలలో విస్తృతంగా ప్రచురించబడింది. తద్వారా APCS యొక్క నియమాలు 3 , 8 ( b ) , 9 , 10 ఉల్లంఘించడం జరిగింది . పైన తెలిపిన అభియోగాలపై జగిత్యాల్ ఎస్పీ సి . హెచు . సింధు శర్మ , ఐపీఎస్ మౌఖ విచారణను జరిపి, సాక్షులను సక్రమంగా విచారించి , ఎగ్జిబిట్ డాక్యుమెంట్లను మార్కింగ్ చేసి , ఇట్టి వ్యక్తి పై మోపబడిన అభియోగాలు నిరూపించబడినవని నివేదిక పంపడం జరిగింది.
జగిత్యాల్ ఎస్పీ సింధు శర్మ గిరి సత్తమ్మ, మాడపాటి నరేందర్ రావు, సంకిసాల సరళ, బండమీది అభియోగాలపై వీరమ్మ, కాంతల స్వప్న, ఉట్నూరి భారతి , ఆర్ . గోమతి , చీల శ్రీకాంత్ రెడ్డి ( మోహన్ రెడ్డికి తన చిన్ననాటి స్నేహితుడు ) కొత్తపేట రాజయ్య . సుబ్బరాయుడు, IPS , SP , ( Adimn ) , CID , TS , హైదరాబాద్ గతంలో Addl . SP ( Opns ) , కరీంనగర్ , కె . హరిప్రసాద్ , ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ , ఇంటెలిజెన్స్ , TS , హైదరాబాద్ గతంలో కరీంనగర్ టౌన్ PS . సాక్షులను అంతేకాకుండా మోహన్ రెడ్డిని విచారించారు. ASI / 760 తన సహచరులతో కలిసి అధిక వడ్డీలకు అక్రమంగా రుణాలు ఇవ్వడం మోసపూరితంగా బలవంతంగా భూములను లాక్కోవడం, బెదిరింపులకు పాల్పడడం, రుణగ్రహీతలపై వేధింపులకు గురి చేయడం, ఇతని మూలంగా రామవరపు ప్రసాదరావు (Ken Crest విద్య సంస్థ అధిపతి) ఆత్మహత్య చేసుకోవడం, ఇవియే కాక తన పిస్టల్ తో కాంతల స్వప్న అనే అతని బాధితురాలిని చంపేస్తానని బెదిరించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Karimnagar, Local News, Telangana