హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telegram యాప్‌లో child pornography -రూ.30వేల ఆదాయం -ఫిర్యాదలు లేకున్నా ఆ టెకీని Telangana పోలీసులు ఎలా ట్రాక్ చేశారంటే..

Telegram యాప్‌లో child pornography -రూ.30వేల ఆదాయం -ఫిర్యాదలు లేకున్నా ఆ టెకీని Telangana పోలీసులు ఎలా ట్రాక్ చేశారంటే..

పోక్సో చట్టం కింద టెకీ అరెస్ట్

పోక్సో చట్టం కింద టెకీ అరెస్ట్

అతను చేసేది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం.. కుటుంబ నేపథ్యం కూడా పర్వాలేదు.. కానీ అదనపు సంపాదనపై ఆశ పెరిగింది.. ఆ క్రమంలోనే అడ్డదారులు అణ్వేషించాడు.. కష్టపడకుండా డబ్బులు పోగేసుకోడానికి పోర్న్ దందా ఎంచుకున్నాడు.. తన టెకీ తెలివితేటలతో నిషేధిత చైల్డ్ పోర్నోగ్నఫీ కంటెంట్ ను డౌన్ లోడ్ చేసి డేటాలెక్కన సోషల్ మీడియాలో అమ్ముకున్నాడు.. నెలలుగా సాగుతోన్న ఈ దందాలో భారీగా డబ్బులు పోగేసుకున్నాడు.. ఈ తతంగంపై ఇప్పటిదాకా ఫిర్యాదులేవీ రాలేదు.. కానీ తెలంగాణ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఆ చీడపురుగును పట్టేసుకున్నారు..

ఇంకా చదవండి ...

‘మొబైల్ ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారా? అయితే కటకటాల్లో కూర్చోడానికి సిద్ధంగా ఉండండి’ తరహా హెచ్చరికలు ఇటీవల చాలానే వింటున్నాం. దేశంలో పోర్నోగ్రఫీపై నిషేధం ఉన్నప్పటికీ చూసేవాళ్ల సంఖ్య తగ్గడంలేదు. అయితే, చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ పై మాత్రం ప్రభుత్వాలు ఉక్కుపాదాన్ని మోపాయి. తెలంగాణ పోలీసులైతే ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. అంతర్జాతీయ సంస్థల సాయంతో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ ఫ్లోపై గట్టి నిఘా పెట్టిన తెలంగాణ పోలీసులు.. నేరస్తులు ఏ మూలా దాక్కున్నా దొరకబుచ్చుకుని కటకటాల్లోకి నెడుతున్నారు. రోడ్ల మీద నిత్యం పెట్రోలింగ్ చేస్తోన్న తరహాలోనే మన పోలీసులు ఆన్ లైన్ లోనూ నిరంతరాయంగా (సైబర్) పెట్రోలింగ్ చేస్తూ నేరాలను కట్టడిచేస్తున్నారు. తాజాగా కరీంనగర్ లో వెలుగులోకి వచ్చిన ఉదంతం విషయానికొస్తే..

ఈజీ మనీకి అలవాటు పడిన ఓ యువకుడు చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలను టెలిగ్రామ్ లాంటి సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా అమ్మకాలు సాగిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌ మండలంలోని నుస్తులాపూర్‌కి చెందిన వంగాల మధుకర్‌ రెడ్డి(23) బీటెక్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంట్లో నుంచే పనిచేస్తూ ఈజీ మనీ కోసం సోషల్ మీడియాలో చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోల దందాకు దిగాడు. టెలిగ్రామ్ యాప్ లో గ్రూపులను ఏర్పాటు చేసి, అందులో చేరడానికి కొంత రేటు ఫిక్స్ చేసి, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను షేర్ చేస్తూ, వీడియోకు ఇంత చొప్పున డబ్బులు పోగేశాడు.

నిందితుడు మధుకర్ రెడ్డి తన మొబైల్‌లోని టెలీగ్రామ్‌ యాప్‌ ద్వారా పోర్న్‌వెబ్‌ సైట్ల నుంచి చిన్నారుల అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి అదే యాప్‌ ద్వారా వాటిని రూ.100కు 300 నుంచి 1000 వరకు విక్రయించాడు. దాదాపు నాలుగు నెలలుగా వందలాది చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను షేర్‌ చేసి రూ.30వేల వరకు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు. తన వివరాలు బయట పడకుండా, ఈ-పేమెంట్ల కోసం థర్డ్‌ పార్టీ ద్వారా క్యూ ఆర్‌ కోడ్‌ పొంది స్కాన్‌ అండ్‌ పేతో డబ్బులు తన అకౌంట్లోకి జమ అయ్యేలా చేసుకున్నాడు. అయితే,

తెలంగాణ పోలీస్ శాఖలోని విమెన్ సేఫ్టీ విభాగం.. ఈ తరహా నేరాల కట్టడికి నిరంతరాయంగా సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నది. ఆ క్రమంలోనే మధుకర్ రెడ్డి బాగోతం బట్టబయలైంది. మధుకర్ రెడ్డి దందాను గుర్తించిన విమెన్ సేఫ్టీ విభాగం.. కరీంనగర్ జిల్లా పోలీసులను అలెర్ట్ చేయడంతో లోయర్ మానేర్ డ్యామ్(ఎల్‌ఎండీ) పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం నిందితుణ్ని అరెస్టు చేసి, అతని సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు.

పసి పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడటం, ప్రోత్సహించే వారిపై పీడీయాక్ట్‌ నమోదు చేస్తామని, చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా, సెర్చ్ చేసినా, ఫార్వర్డ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ విజయసారథి హెచ్చరించారు.  నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్మీనారు. మీడియా సమావేశంలో సీఐ శశిధర్‌ రెడ్డి, ఎస్సై ప్రమోద్‌ రెడ్డి, ఉమెన్‌ సేఫ్టీవింగ్‌ అధికారులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, వాటి సంఖ్య పెరగడానికి చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా ఓ ప్రధాన కారణమే అని పోలీసులు చెబుతున్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Karimnagar, Pornography case, Posco case, Telangana Police

ఉత్తమ కథలు