Minor Girl: మరో దారుణం.. ఐదేళ్ల బాలికపై 17 ఏళ్ల యువకుడు లైంగిక దాడి.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: ఆరేండ్ల బాలికపై జరిగిన హత్యాచారం ఘటన మరువక ముందే జగిత్యాల జిల్లాలో మరో ఐదేండ్ల బాలికపై అత్యాచార ఘటన చోటుచేసుకుంది . ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఐదేళ్ల బాలికపై 17 ఏళ్ల యువకుడు అఘాయిత్యంకు పాల్పడ్డాడు . నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

 • Share this:
  ఆరేండ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన మరువక ముందే జగిత్యాల(Jagityala) జిల్లాలో మరో ఐదేండ్ల బాలికపై(Minor Girl) అత్యాచార ఘటన చోటుచేసుకుంది . ధర్మపురి(Dharmapuri) మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఐదేళ్ల బాలికపై 17 ఏళ్ల యువకుడు(Young BoY) అఘాయిత్యంకు పాల్పడ్డాడు . నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు . బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు . సంఘటన బుధవారం జరుగగా గురువారం వెలుగులోకి వచ్చింది . సంబంధిత పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలు ఆందోళన చేపట్టరు. . పోలీస్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి కేసును దర్యాప్తు జరుపుతున్నారు .

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది . ఇదిలా ఉండగా.. హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌ ఘటన తీవ్ర‌ క‌ల‌క‌లం రేపినవిషయం తెలిసిందే. తర్వాత మంగ‌ళ్‌హాట్ ప‌రిధిలో తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారం జ‌రిగింది. స్థానికంగా ఉండే ఓ యువ‌కుడు అత్యాచారం చేసిన‌ట్లు బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి 11 గంట‌ల‌కు సుమిత్ అనే యువ‌కుడు ఖాళీగా ఉన్న దుకాణం షేటర్‎లోకి చిన్నారిని లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో.. అక్క‌డికి వెళ్లిన స్థానికులు.. సుమిత్‌ను ప‌ట్టుకునేందుకు ప్రయత్నించారు.

  భార్య ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫొటోలు తీశాడు.. వాటిని అడ్డం పెట్టుకొని ఆ పని చేయమంటూ బెదిరించిన భర్త.. చివరకు ఏం జరిగిందంటే..

  కానీ అతడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. స్థానికుల అలర్ట్‎తో చిన్నారి సేఫ్‎గా బయటపడింది. తప్పించుకున్న నిందితుడిని అత్తాపూర్‎లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హ‌బీబ్‌న‌గ‌ర్ ప‌రిధిలో న‌మో దైన ఓ చోరీ కేసులో సుమిత్ నిందితుడిగా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. బాలిక నివ‌సించే ప్రాంతానికి పోలీసుల‌తో క‌లిసి చేరుకున్న ఏసీపీ న‌రేంద‌ర్ రెడ్డి అత్యాచార ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. మొద‌ట బాలిక‌ను భ‌రోసా కేంద్రానికి త‌ర‌లించి, అక్క‌డి నుంచి వైద్య ప‌రీక్ష‌ల కోసం కోఠి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  ఇక సైదాబాద్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరవకముందే మళ్ళీ అలాంటి దారుణమే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడికి కఠిన శిక్ష వేయాలని బాధితురాలి తల్లి తండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలో అత్యాచారాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

  Telangana News: వామ్మో.. ఏందిది.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దేవుడిని కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్..


  వారి తల్లిదండ్రుల పిల్లలను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉంటే మంచిది. కఠినమైన చట్టాలు కీచక కాండలను ఆపడం లేదని సర్వేల్లో స్పష్టం అవుతోంది. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయడానికి తీవ్రమైన శిక్షలతో కూడిన చట్టాలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
  Published by:Veera Babu
  First published: