హోమ్ /వార్తలు /తెలంగాణ /

పుల్వామా ఎఫెక్ట్... ఇక ‘ఇండియన్ కరాచీ బేకరీ’గా కరాచీ బేకరీ

పుల్వామా ఎఫెక్ట్... ఇక ‘ఇండియన్ కరాచీ బేకరీ’గా కరాచీ బేకరీ

కరాచీ బేకరీ( facebook image)

కరాచీ బేకరీ( facebook image)

భారత్‌లో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న కరాచీ బేకరీలకు ఈ సెగ తగిలింది. పాకిస్థాన్ నగరమైన కరాచీ పేరుతో మన దేశంలో బేకరీలు నిర్వహించడాన్ని బీజేపీ కార్యకర్తలు తప్పుబట్టారు. దీంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

    పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రవాదుల మారణకాండ... ఆ తరువాత భారత్ పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా... దేశంలోని పౌరులు పాక్ తీరుపై రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న కరాచీ బేకరీలకు ఈ సెగ తాకింది. పాకిస్థాన్ నగరమైన కరాచీ పేరుతో మన దేశంలో బేకరీలు నిర్వహించడాన్ని బీజేపీ కార్యకర్తలు తప్పుబట్టారు. వెంటనే కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ ఆందోళనలకు దిగారు. దీంతో తమ బ్రాంచ్‌ల దగ్గర సెక్యురిటీ పెంచడంతో పాటు .. ఇది అచ్చమైన భారతీయ సంస్థేనని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.


    తాజాగా పరిణామాల నేపథ్యంలో పేరు మార్పుపై కరాచీ బేకరీ యాజమాన్యం ఓ ప్రకటన చేసింది. ఇకపై తమ సంస్థలకు ‘ఇండియన్ కరాచీ’గా పేరు మారుస్తున్నట్టు తెలిపింది. మోజాంజాహి మార్కెట్‌ దగ్గర ఉన్న కరాచీ బేకరీ యాజమాన్యాన్ని కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలోని బీజేపీ నేతలు సంప్రదించగా... వాళ్లు ఆయనకు ఈ హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో ఇండియన్‌ కరాచీ బేకరీ పేర్లు పెడతామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు.

    First published:

    Tags: Bjp, Hyderabad, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు