హోమ్ /వార్తలు /తెలంగాణ /

SAD NEWS: భార్యల ఎడబాటు భరించలేకపోయిన భర్తలు..ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

SAD NEWS: భార్యల ఎడబాటు భరించలేకపోయిన భర్తలు..ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

suicide

suicide

SAD NEWS:వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకోవడం. తర్వాత పిల్లల్ని కనడం..ఆతర్వాత భార్యభర్తలిద్దరూ నామాటే నెగ్గాలంటే..నేను చెప్పిందే జరగాలనే కోపంతో తమకు తామే భరించలేనంత కఠినశిక్ష వేసుకుంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kamareddy, India

భార్య, భ‌ర్త‌ల బంధం అనేది మూడుముళ్ల‌తో మూడిప‌డిన బంధం. వివాహం అనే బంధంతో ఆడ‌, మ‌గ‌ ఇద్ద‌రు మ‌నుషులు ఒక్క‌టిగా మారి జీవితాంతం కలిసి జీవిస్తామని బాసాలు చేస్తారు. అయితే  వారి సంసార జీవితంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను కూర్చొని ప‌రిష్క‌రించుకుంటే స‌మస్య‌ల‌కు స‌మాధానం దొరుకుతుంది. కానీ కొంద‌రు బార్య‌, భ‌ర్త‌లు తాము చెప్పిందే జ‌రగాలని పంతం పట్టుకొని మాటకు మాట పెంచుకుని ప‌చ్చ‌ని సంసారాల‌ను నాశనం చేసుకుంటున్నారు. కామారెడ్డి(Kamareddy) జిల్లాలో భార్య  భ‌ర్త ల మ‌ధ్య గొడ‌వ కార‌ణంగా భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రాక‌పోవ‌డంతో భ‌ర్త మ‌న‌స్తాపం చెందాడు. ఆ తర్వాత ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు.

TS RTC: అడ్వాన్స్ బస్ టికెట్‌ బుకింగ్‌పై 5నుంచి 10శాతం డిస్కౌంట్ .. ప్రయాణికులకు TS RTC బంపర్ ఆఫర్

మనస్పర్దలే కొంప ముంచుతున్నాయి..

కామారెడ్డి జిల్లా మున్సిప‌ల్ ప‌రిధిలోని టేక్రియాల్  గ్రామానికి చెందిన చెవిటి ప్రవీణ్‌కి దేవునిపల్లికి  చెందిన లాస్యతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే  భార్యా భర్తల మధ్య గొడవలు మొద‌ల‌య్యాయి. దీంతో గ‌త‌ యేడాది నుంచి లాస్య తన తల్లి గారింటి వ‌ద్ద‌ ఉంటుంది. అయితే భార్యను కాపురానికి ర‌మ్మ‌ని ఎంత బ్ర‌తిమిలాడినా రాలేదు.  భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపం చెందిన ప్రవీణ్ ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  దేవు నిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు.

ప్రాణాలు తీసుకున్న భర్తలు..

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని జన్నెపల్లి గ్రామానికి చెం దిన బోడ నరేందర్ మద్యానికి బానిసై భార్య లక్ష్మీతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే భార్యతో గొడవపడటంతో 15 రోజుల కిందట భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తాగుడికి బానిసై జీవితంపై విరక్తి చెందిన నరేందర్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు చేశామని పోలీసులు తెలిపారు. పంతానికి పోయి భార్యభర్తలు పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కేవలం కూర్చొని పరిష్కరించుకునే సమస్యను సమాధుల వరకు తీసుకెళ్లి ..అయిన వాళ్లకు, నమ్ముకున్న వాళ్లకు తీరని అన్యాయం చేస్తున్నారు. క్షణికావేశంలో పోతే తిరిగిరాని జీవితానికి మరణ శిక్ష విధించుకంటున్నారు.

First published:

Tags: Nizamabad, Telangana News

ఉత్తమ కథలు