హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cyber ​​Fraud: టీచర్‌ని ట్రాప్‌ చేసిన సైబర్ నేరగాళ్లు .. ఏం పేరుతో చీటింగ్‌ చేశారో తెలుసా..?

Cyber ​​Fraud: టీచర్‌ని ట్రాప్‌ చేసిన సైబర్ నేరగాళ్లు .. ఏం పేరుతో చీటింగ్‌ చేశారో తెలుసా..?

Cyber Fraud

Cyber Fraud

Cyber ​​Fraud: ఆన్ లైన్‌లో టికెట్‌ కోసం సెర్చ్ చేసిన భక్తురాలిని సైబ‌ర్ నేర‌గాళ్ల ట్రాప్ చేశారు. ఆమెను టికెట్ పేరుతో బురిడి కొట్టించి అందిన కాడికి దొచుకున్నారు. ఒక టీచ‌రే సైబ‌ర్ నేర‌గాళ్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్న సంఘటన ఎక్కడ జరిగిందంటే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kamareddy, India

(P.Mahendar,News18,Nizamabad)

తానొక‌టి త‌లిస్తే దైవం ఒక‌టి మరొకటి తలవడం అంటే ఇదేనేమో. దైవ ద‌ర్శ‌నం చేసుకుందామ‌ని ఆన్ లైన్‌లో టికెట్‌ కోసం సెర్చ్ చేసిన భక్తురాలిని సైబ‌ర్ నేర‌గాళ్ల ట్రాప్ చేశారు. ఆమెను టికెట్(Ticket) పేరుతో బురిడి కొట్టించి అందిన కాడికి దొచుకున్నారు. ఒక టీచ‌రే సైబ‌ర్ నేర‌గాళ్ల(Cyber criminals)ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్న సంఘటన కామారెడ్డి (Kamareddy)జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  కామారెడ్డి జిల్లా క‌ల్కి న‌గ‌ర్ కు చెందిన ఉపాద్యాయురాలుTeacher విజ‌య ల‌క్ష్మి(Vijaya Lakshmi)... కుటుంబంతో క‌లిసి కాశ్మీర్ (Kashmir)లోని వైష్ణావి దేవి(Vaishnavi Devi)ఆల‌యానికి దైవ ద‌ర్శ‌నం కోసం వెళ్లాలి అనుకుంది. అందులో భాగంగానే సైబర్‌ నేరగాళ్ల వలలో పడింది.

Success Story: ఎస్‌ఐ ఉద్యోగానికి ఒకే ఇంట్లో ఇద్దరు ఎంపిక .. ఫిజికల్ ఈవెంట్స్‌లో సెలక్టైన తల్లీ,కూతురు

ఇదో టైపు మోసం ..

కామారెడ్డి జిల్లా క‌ల్కి న‌గ‌ర్ కు చెందిన ఉఎపాద్యాయురాలు విజ‌య ల‌క్ష్మి తన కుటుంబంతో క‌లిసి కాశ్మీర్ లోని వైష్ణావి దేశి ఆల‌యానికి దైవ ద‌ర్శ‌నం కోసం వెళ్లాలి అనుకుంది. వైష్ణావి దేవి ఆల‌యం వ‌ర‌కు న‌డవ‌డం సాద్యం కాదు అనుకుంది. దీంతో  పైకి వెళ్లేందుకు హెలికాప్ట‌ర్ బుక్ చేసుకొవాల‌నుకుంది. అయితే హెలిక్యాప్ట‌ర్ బుకింగ్ కోసం ఆన్ లైన్ లో సెర్చు చేసింది. ఆమెకు ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరగాళ్లు టీచర్‌ని ట్రాప్ చేశారు. హెలికాప్టర్ బుకింగ్ నెంబ‌ర్ ఇచ్చారు. ఆ నంబ‌ర్‌ను సంప్ర‌దించింది. అయితే అవతలి వ్యక్తులు టికెట్ ధర చెప్పగానే వాళ్లడిగినంత చెల్లించింది అయినప్పటికి టికెట్ రాలేదు.

టికెట్ పేరుతో మోసం ..

టికెట్ రాకపోవడంతో టీచర్ విజయలక్ష్మి మళ్లీ ఫోన్ చేసి అడిగితే ఇంకా డ‌బ్బులు కావాల‌ని డిమాండ్ చేశారు. దాంతో మోసపోయినట్లుగా గ్రహించారు టీచర్ విజయలక్ష్మి. అయితే అప్ప‌టికే సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు  18,240రూపాయలు వసూలు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల రూపంలో మోసపోయిన విజయలక్ష్మీ దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు... కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సెర్చ్ చేసేటప్పుడు అలర్ట్..

ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఎదురుచూస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నా..జనం తొందరపాటుతో, తెలిసి తెలియక వాళ్ల ఉచ్చులో పడి నష్టపోతున్నారు. ఇందుకు చదువుకున్న వాళ్లు కూడా బలవడంతో పోలీసులు ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

First published:

Tags: CYBER FRAUD, Kamareddy, Telangana crime news

ఉత్తమ కథలు