హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: చచ్చిపోదామని పేరెంట్స్‌ని చెరువుకు తీసుకెళ్లిన కొడుకు ..తర్వాత ఏమైందో తెలుసా..

OMG: చచ్చిపోదామని పేరెంట్స్‌ని చెరువుకు తీసుకెళ్లిన కొడుకు ..తర్వాత ఏమైందో తెలుసా..

kamareddy

kamareddy

OMG: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ కొడుకు తల్లిదండ్రులతో కలిసి ముగ్గురం ఆత్మహత్య చేసుకుందామని చెప్పి తీసుకెళ్లాడు. బిడ్డ మనసులో ఉన్న దుర్భుద్ది, వాడు ఒడిగట్టే కిరాతకాన్ని వాళ్లు ముందుగా ఊహించలేకపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kamareddy, India

(P.Mahendar,News18,Nizamabad)

తల్లిదండ్రులు బిడ్డల్ని మాత్రమే కంటారు. వాళ్ల తలరాతల్ని మాత్రం మార్చలేరు. కాని కడుపున బిడ్డే తండ్రి పాలిట కాలయముడైతే ఆ తల్లి పడే ఆత్మక్షోభ , కుటుంబ సభ్యులు పడే బాధ వర్ణించలేనిది. కామారెడ్డి(Kamareddt) జిల్లా కేంద్రంలో ఓ కొడుకు తల్లిదండ్రులతో కలిసి ముగ్గురం ఆత్మహత్య చేసుకుందామని చెప్పి తీసుకెళ్లాడు. బిడ్డ మనసులో ఉన్న దుర్భుద్ది, వాడు ఒడిగట్టే కిరాతకాన్ని వాళ్లు ముందుగా ఊహించలేకపోయారు. ఒకరి ప్రాణం పోయిన తర్వాత తెలిసింది. విద్యానగర్ కాలనీ(Vidya Nagar Colony)లో ఉండే మహ్మద్ సలీం(Mohammad Saleem), రేష్మాబేగం(Reshmabegum) దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు కలీం(Kaleem)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కలీం తాగుడుకు బానిసగా మారడంతో భార్య వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత నుంచి ఖర్చుల కోసం, మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని కలీం తల్లిదండ్రులతో గొడవపడేవాడు.చివరగా దుబాయ్(Dubai)వెళ్లేందుకు డబ్బులివ్వమని వేధించడంతో అప్పు తెచ్చి ఇస్తామని చెప్పినప్పటికి వినకుండా డబ్బులిస్తారా లేదంటే చావమంటారా అని వాదించుకున్నారు. ఈక్రమంలోనే ముగ్గురం చనిపోదామని చెప్పి చెరువుకు వెళ్లారు. అక్కడ తండ్రి నీళ్లలో మునిగిపోవడం చూసి భయపడిన కలీం తల్లిని తీసుకొని వెనక్కి వచ్చాడు. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి చావుకు కారణమైన కొడుకు..

కామారెడ్డి జిల్లాలో ఓ కొడుకు తండ్రి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నప్పటికి ..ఆ కొడుకు ఓడిగట్టిన కిరాతాన్ని కన్నతల్లి ప్రత్యక్షంగా చూసి నివ్వెరపోయింది. తన చెడు వ్యసనాల కోసం డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో కలీం అనే వ్యక్తి కామారెడ్డి జిల్లాలోని విద్యానగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. తండ్రి సలీం, తల్లి రేష్మాబేగంతో కలిసి జీవిస్తున్నాడు. కలీం మద్యంకు బానిసవడంతో భార్య వదిలిపెట్టింది. దీంతో చెడు వ్యసనాల కోసం తల్లిదండ్రుల్ని డబ్బుల కోసం వేధించసాగాడు. వాళ్లు కొడుకు పెట్టే టార్చర్ భరించలేక డబ్బుల కోసం గొడవపడుతూ వచ్చారు. చివరగా దుబాయ్ వెళ్తానంటూ డబ్బులు ఇవ్వమన్నాడు. అప్పుగా తెచ్చిస్తామని చెప్పినప్పటికి వినకుండా శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు.

డబ్బు కోసం బ్లాక్‌మెయిల్..

తనకు డబ్బులు ఇస్తారా..  లేదంటే చావమంటారా అంటూ వాదించాడు.   త‌ల్లి, తండ్రితో కలిసి ప్రాణాలు తీసుకోవాలని చెరువు దగ్గరకు తల్లిదండ్రులను తీసుకెళ్లాడు. అయితే తండ్రి స‌లీం మొద‌ట నీటిలో మునుగాడాన్ని చూసి  భయపడిన కలీం తల్లిని తీసుకుని వెనక్కి వచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. రేష్మాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Encounter: గడ్చిరౌలిలో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ మృతి..భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

ఓ తల్లి ఆవేదన..

కొడుకు దుబాయ్ వెళ్తానని కొంత రోజులుగా  డబ్బులు కావాలని వేధించసాగాడని..అప్పుతీసుకు వ‌స్తామ‌ని చెప్పినప్పటికి వినకుండా తమతో గొడవపడ్డాడని రేష్మాబేగం పోలీసులకు తెలిపింది. ఈక్రమంలోనే చనిపోదామని తల్లిదండ్రుల్ని చెరువుకు తీసుకెళ్లి తండ్రిని వదిలించుకున్నాడని రేష్మాబేగం చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Kamareddy, Telangana News

ఉత్తమ కథలు