హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana News: చల్లారని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ..మరో రైతు ఆత్మహత్యాయత్నం

Telangana News: చల్లారని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ..మరో రైతు ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం..మరో రైతు ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం..మరో రైతు ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ (Master Plan) రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పటికే సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరొక రైతు ఆత్మత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.   

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kamareddy | Telangana

(P.Mahendar,News18,Nizamabad)

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ (Master Plan) రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పటికే సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరొక రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

BJP: పాలమూరుపై బీజేపీ ఫోకస్.. పట్టు సాధించేందుకు వ్యూహరచన

కామారెడ్డి జిల్లాలోని రామేశ్వ‌ర ప‌ల్లి గ్రామానికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ, సంతోష్ ఇద్దరు అన్నదమ్ములు. వీరికి గ్రామంలో 89 సర్వే నంబర్ లో ఎకరం భూమి ఉంది. అయితే బాలకృష్ణకు ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) మిధున, మేఘన ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అయితే ఇద్దరు పిల్లలు డాక్టర్ చదువు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో తన భాగం భూమిని బాలకృష్ణ అమ్మడానికి ప్రయత్నించగా గతంలో 70 లక్షలు పలికిన భూమి ధర ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో గ్రీన్ జోన్లో రావడంతో 20 లక్షలకు కూడా అమ్ముడు పోలేదు. దీంతో తన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని మనస్తాపం చెందిన బాలకృష్ణ గ్రామంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద పోలానికి వాడే గడ్డి మందును ఆపిల్ ఫిజ్ కూల్ డ్రీంక్  బాటిల్ లో కలుపుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు.

Police Mock Drill: కొండగట్టు గుడి దగ్గర భక్తుల కిడ్నాప్ .. రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు..అసలేం జరిగిందంటే

ఇంటికి వచ్చి కుటుంబ‌స‌భ్యుల‌కు బాల‌కృష్ణ‌ విషయం చెప్పాడు. దీంతో వెంటనే బాలకృష్ణను జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఆస్పత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. మాభూమి మాస్టర్ ప్లాన్  కార‌ణంగా గ్రీన్ జోన్ లో పోతుందని తెలిసి నా భర్త ఆవేదనకు గురయ్యాడని బాల‌కృష్ణ భార్య లక్ష్మీ చెబుతున్నారు. గత నెల రోజులుగా రైతులతో కలిసి ఉద్యమంలో కూడా పాల్గొంటున్నాడు. ఆ భూమే మా ఇద్ద‌రు పిల్ల‌ల భ‌విష‌త్తు ఉంద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మా భూమి మాస్టర్ ప్లాన్ లో పోకుండా చూడాలని ఆమె వేడుకుంది.

Rajanna Siricilla: కారు.. బస్సు ఢీ.. ప్రమాదం దెబ్బకి ఊడిన బస్సు చక్రాలు

మ‌రో వైపు కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో బాధితులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. 20వ తేదీలోగా విలీన గ్రామాల కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని, లేకపోతే ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే బీజేపీకి చెందిన రామేశ్వరపల్లి 2వ వార్డు కొన్నిలర్ సుతారి రవి, 11వ వార్డు కౌన్సిలర్ కాసర్ల శ్రీని వాస్ రాజీనామాకు ముందుకు రావడంతో అధికార పార్టీకి చెందిన వారిపై ఒత్తిడి పెరుగుతోంది. రైతుల పక్షాన నిలుస్తామని, మాస్టర్ ప్లాన్ రద్దు చేసేంత వరకు ఉద్యమంలో ఉంటామని స్పష్టం చేశారు.

అయోమయంలో అధికార పార్టీ కౌన్సిలర్లు

అధికార పార్టీకి చెందిన 1వ వార్డు (అడ్లూర్) కొన్సి లర్ గడ్డమీది రాణి, 6వ వార్డు పాతరాజంపేట కౌన్సిలర్ ఆకుల రూప, 9వ వార్డు (లింగాపూర్) కౌన్సిలర్ పడిగే సుగుణ, దేవునిపల్లికి చెందిన 10వ‌, 12వ‌, 35వ‌ వార్డుల కౌన్సిలర్లు ఉర్దోండ‌ వనిత,  కాసర్ల గోదావరి, పోలీస్ కృష్ణాజీరావు, 13వ వార్డు (టేకి యాల్) కౌన్సిలర్ శంకర్రావులపై ఒత్తిడి పెరుగుతోంది. వీరంతా ఈనెల 20వ తేదీలోగా రాజీనామా చేసి, మాస్టర్ ప్లాన్ రద్దు డిమాండుకు మద్ద‌తు తెలపాలని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేయని కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తామని ప్రకటించడంతో అధికార పార్టీ కౌన్సిలర్లు ఆయోమ యంలో ఉన్నారు.

First published:

Tags: Kamareddy, Telangana, Telangana News

ఉత్తమ కథలు