Hospital Seize: కామారెడ్డిలో రెండు ఆస్పత్రులు సీజ్

Kamareddy Hospitals seized | కామారెడ్డి జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న రెండు ప్రైవేటు హాస్పిటల్స్ ను DMHO సీజ్ చేశారు.

news18-telugu
Updated: August 26, 2020, 9:03 PM IST
Hospital Seize: కామారెడ్డిలో రెండు ఆస్పత్రులు సీజ్
కామారెడ్డిలో ఆస్పత్రి సీజ్
  • Share this:
కామారెడ్డి జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న రెండు ప్రైవేటు హాస్పిటల్స్ ను DMHO సీజ్ చేశారు. బిచ్కుంద, పిట్లం మండల కేంద్రాలలో 10పడకల తిరుమల హాస్పిటల్ పేరుతో గత 20 రోజుల క్రితం ఆర్భాటంగా ప్రారంభించారు. ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని స్థానికులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 21న వైద్యశాఖ అధికారులు ఆస్పత్రిని తనిఖీ చేసారు. ఈ తనిఖీల్లో అసలు నిజం బయటపడింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండానే ఆస్పత్రిని నడుపుతున్నారన్న విషయం అధికారులకు తెలిసింది. దీంతో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆస్పత్రిని నడుపుతున్నరని DMHO, MRO, CI తో కలిసి ఆస్పత్రిని సీజ్ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 26, 2020, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading