KAMAREDDY DISTRICT WORKERS IN DUBAI ARE BEGGING US TO TAKE THEM HOME VB NZB
Gulf labour: ఎడారి దేశంలో గల్ఫ్ కార్మికుల దైన్యం.. పక్షం రోజులుగా పస్తులు.. స్వదేశానికి తీసుకెళ్లాలంటూ వేడుకోలు..
దుబాయ్ లో కామారెడ్డి జిల్లా వాసులు
Gulf labour: కరోనా కాలంలో దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్ట చేతపట్టుకుని ఉపాధి కొసం గల్ఫ్ దేశం వెళ్లిన యువకులు.. చివరికి ఎడారి దేశంలో పనిలేక ఏజెంట్ మోసానికి గురయ్యామని గ్రహించి.. స్వదేశానికి తీసుకువెళ్లాలని వేడుకుంటున్నారు.
(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
కామారెడ్డి జిల్లాలో 50 శాతానికి పైగా గల్ఫ్ దేశం వెళ్లినావారు ఉంటారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబాలను వదిలి గల్ఫ్ దేశం వెళ్తున్నారు. అయితే ఈ కరోనా కారణంగా ప్రతి చోట కార్మికులను తగ్గిస్తున్నారు. మరో వైపు గ్రామాల్లో సైతం పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గల్ఫ్ దేశం వెళ్తే ఎంతోకొంత సంపాదించుకోవచ్చనే అలోచనతో ముగ్గురు యువకులు గల్ఫ్ బాట పట్టారు. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన తోర్రోల్ల నరేందర్, బోయిని నవీన్, ఈబిబీ రమేష్ అనే ముగ్గురు యువకులు. అదే గ్రామానికి చెందిన ఓ ఏజెంట్ ను కలిశారు. అయితే దుబాయిలో క్లీనింగ్ కంపెనీలో మంచి పని ఉంది.. మంచి జీతం వస్తుందని చెప్పాడు.. అయితే వారు ఆ ఏజెంట్ కు డబ్బులు కట్టి ఏప్రిల్ 14న దుబాయికి వెళ్లారు.. తీరా దుబాయి ఎర్ పోర్టులో దిగిన తరువాత కంపెనీ వారు ఎవరూ రాలేదు. అయితే టూరిస్టు విసా పై రావడంతో వారిని బయటకు పంపారు.
బయటకు వెళ్లిన తర్వాత ఎవరు రాలేదు . ఎంచేయలో తెలియక రోడ్డు ప్రక్కన ఉన్న ఓ రేకుల షెడ్డులో ఉంటూ కాలం వెళ్లీదీస్తున్నారు. పక్షం రోజులుగా నాలుగ గోడలకు పరిమితం అయ్యామని వాపోతున్నారు. మంచి ఉద్యోగం ఉంటుందని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు చెల్లించి విమానం ఎక్కి వెళ్లి నలుగు గోడల మధ్య బందీలుగా మారామని వాపోతున్నారు. దూబాయిలో కూడా కరోనా కారణంగా పనులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాకు తెలిసిన వారు ఎవరూ లేరు... ఎక్కడికి వెళ్లాలో కూడా మాకు తెలియదు.. మాకు మీరే సహాయం అందించాలని తెలంగాణ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డికి వట్సాప్ లో వారు పడుతున్న దృశ్యాలను పంపించారు.
వారికి సంబంధించిన పాస్ పోర్ట్ లు పంపించారు. ఎలాగైన తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి మా ముగ్గురిని స్వదేశానికి తీసుకు రావాలని వారు వేడుకుంటున్నారు. ఉన్న ఊరిలో కన్నవారితో కలిసి కారం మెతుకులు తిన్నా సరే తమను స్వదేశానికి తీసుకు పొండి అని కొరుతున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి ఇంకా ఎవరూ గల్ఫ్ కు రావద్దంటూ బాధితులు కోరుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.