నలుగురు స్నేహితులు.. ఎప్పుడు కలిసి తిరుగుతారు.. ఒకరింటికి ఒకరు వెళుతుంటారు. అయితే ఓ స్నేహితుని ఇంటికి వచ్చినప్పుడు మరో స్నేహితుడు మీ ఇంట్లో బంగారం కనిపిస్తుంది.. ఆ బంగారం బయటకు రావాలంటే పూజలు చేయాలని చేప్పాడు. అయితే అందుకోసం డబ్బులు కర్చు ఆవుతుందని చేప్పారు.. ఆ స్నేహితుని మాటలు నమ్మి 3 లక్షల 45 వేలు సమర్పించుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చొటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్ లో నివాసముంటున్న హజరాబేగం కు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హజరాబేగం మూడో కుమారుడు సయ్యద్ అబ్దుల్ రహమాన్ అలియాస్ మున్నా ఇంటర్ ద్వి తీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే మున్నా స్నేహితులైన జావిద్, సోహేల్, లతీఫ్ చాలా సార్లు మున్నా ఇంటికి వచ్చివెళ్లె వారు. అయితే జావిద్.. మున్నాతో మీ ఇంట్లో బంగారం ఉన్నట్లు నాకు కనిపిస్తుంది అని చేప్పాడు. పూజలు చేస్తే బయటకు వస్తుందని మున్నా తల్లి హజరాబేగంను నమ్మించారు. అయితే పూజలు చేయడానికి ఖర్చు అవుతుందని చేప్పారు.. దీంతో మున్నా తల్లి కర్చు అయినా పర్వాలేదు అంది. దీంతో జనవరి లో 25 వేలు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకుని మున్నాతో పాటు సోమేశ్వర్ గుట్ట పై ఉన్న దర్గా వద్దకు వెళ్లి పూజలు చేశారు. కాళిమాత వచ్చింది.. రోజు ఐదు కోళ్లు కోయాలని చెప్పడంతో బాధితురాలు మరో 25 వేలు ఇచ్చారు. మున్నా ఇంటికి వెళ్లి జావిద్, సోహేల్, లతీప్ కొత్త సూట్ కేసులు తీసుకుని రావాలని చెప్పారు. సూట్కేస్ తీసుకురాగానే అందులో బంగారం చూపిస్తామని చెప్పి లైట్లు ఆర్పివేసి క్యాండిల్స్ వెలుగులో పూజలు చేశారు. ఒక దాంట్లో నుంచి చిన్న బంగారం కడ్డిని చూపించారు. దీంతో మున్నా తల్లి నమ్మింది. అయితే తాము మళ్లీ వచ్చే వరకు సూట్కేసులను చూడవద్దని చెప్పి అప్పటి నుంచి పలు విడతల్లో మొత్తం 3 లక్షల 45 వేల రూపాయలు వసూలు చేశారు. వారు సూట్కేసులను తెరవకపోవడంతో అనుమానం వచ్చి హజరాబేగం శనివారం రాత్రి తెరిచి చూడగా అందులో కుండ, పచ్చబట్ట, నిమ్మకాయ, బియ్యం ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించి హజ రాబేగం పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసిన జావిద్, సోహేల్, లతీఫ్ లపై చర్యలు తీసుకోవాలని బాన్సువాడ పిఎస్ లో ఫిర్యాదు చేసింది.
TSPSC Paper leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తీగలాగితే డొంక కదిలింది..జగిత్యాల జిల్లాలో విజిలెన్స్ఎంక్వయిరీ..
మీ ఇంట్లో బంగారం ఉందని మోసం చేసారని హజరాబేగం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బాన్సువాడ సీఐ మహేందర్ రెడ్డి చెబుతున్నారు.. పిర్యాదు రాలు చిన్న కోడుకు మున్నా, మున్నా స్నేహితులైన జావిద్, సోహేల్, లతీఫ్ ముగ్గురు ప్రతిరోజు మున్నా ఇంటికి వచ్చేవారని.. అయితే మున్నాకు మీ ఇంట్లో బంగారం కనిపిస్తుంది. క్షుద్ర పూజలు చేస్తే ఆ బంగారం బయటకు వస్తుందని మున్నా కుటుంబాన్ని నమ్మించారు. వారి మాటలు నమ్మి వారు చెప్పినట్టుగా చేశారు. కొత్త సూట్ కేసులు తీసుకువచ్చి మీ ఇంట్లో పెట్టి పూజలు చేస్తే ఆ సూట్ కేసులు నిండా బంగారం వస్తుందని నమ్మబలికారు. వారి వద్ద నుంచి దాదాపుగా మూడు లక్షల 45 వేల రూపాయలు తీసుకున్నారని సీఐ అన్నారు. బంగారం ఉందని నమ్మబలికి మోసం చేసిన ముగ్గురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. వీరితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నామన్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold robbery, Telangana