KALYANA LAXMI BENEFICIARIES REACHED TO TEN LAKHS SAID HARISH RAO VRY
Harish rao : కళ్యాణ లక్ష్మిలో రికార్డు.. 10 లక్షలకు చేరిన లబ్ధిదారులు..
ఆసుపత్రికి శంకుస్థాపణ చేస్తున్న మంత్రి హరీష్ రావు
Harish rao : కళ్యాణ లక్ష్మి పథకం అమలులో తెలంగాణ రికార్డు సాధించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పథకం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు 10 లక్షల మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి డబ్బులను అందింమని చెప్పారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి వందపడకల ఆసుపత్రికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. సుమారు ముప్పై అయిదు కోట్లతో ఆధునుతన భవనాన్ని నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ సంధర్భంగా ఆయన మీడయాతో మాట్లాడుతూ వైద్య రంగంలో తెలంగాణ సాధిస్తున్న విజయాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో 52 శాతం మేర ప్రసవాలు అవుతున్నాయని ఆయన వివరించారు. కాగా అంతకు ముందు 30 శాతం మేర మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రససవాలు జరిగేవని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేయడం వల్లే ఇది సాధ్యమని ఆయన చెప్పారు.
మరోవైపు సత్తుపల్లి ప్రత్యేకంగా టీ డైయాగ్నోసిస్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వందపడకల ఆసుపత్రికి అనుగుణంగా సిబ్బందిని సైతం పెంచుతామని చెప్పారు. హైదరాబాద్ మినహా క్యాత్ ల్యాబ్ సెంటర్ ఏర్పాటు అయిన మొదటి జిల్లా ఖమ్మం జిల్లా అని ఆయన గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నీస్ సెంటర్ ఏర్పాటు చేశామని కాని ప్రత్యేకంగా సత్తుపల్లి ఈ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఇక డయాలసీస్ రోగులకు కూడా అందుబాటులోనే వైద్యం అందిస్తున్నట్టు ఆయన వివరించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం రికార్డు సాధించిందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 లక్షల మంది పెళ్లిల్లకు కళ్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులు అందించినట్టు చెప్పారు. ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా పారదర్శకంగా సాగుతున్న ఫథకం కళ్యాణ లక్ష్మి పథకమని ఆయన కొనియాడారు. అందుకే తమిళనాడు లాంటీ రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.