హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLC Kavitha: కేటీఆర్ తో కలిసి ఢిల్లీకి కవిత..రేపటి ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ!

MLC Kavitha: కేటీఆర్ తో కలిసి ఢిల్లీకి కవిత..రేపటి ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ!

కవిత, కేటీఆర్

కవిత, కేటీఆర్

MLC Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. ఈనెల 11న ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kalvakuntla Kavitha)ను 9 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు 16న మరోసారి రావాలని నోటీసులిచ్చారు. ఈ క్రమంలో 16న కవిత విచారణకు హాజరు కాకపోవడంతో హైడ్రామా నెలకొంది. ఈ క్రమంలో ఈనెల 20న విచారణకు రావాలని ఈడీ మూడోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kalvakuntla Kavitha) తమ్ముడు కేటీఆర్ తో కలిసి ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

MLC Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. ఇప్పటివరకు సీబీఐ కేసు దర్యాప్తులో దూకుడు పెంచగా ఇప్పుడు ఈడీ వంతైంది. ఈనెల 11న ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kalvakuntla Kavitha)ను 9 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు 16న మరోసారి రావాలని నోటీసులిచ్చారు. ఈ క్రమంలో 16న కవిత విచారణకు హాజరు కాకపోవడంతో హైడ్రామా నెలకొంది. ఈ క్రమంలో ఈనెల 20న విచారణకు రావాలని ఈడీ మూడోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kalvakuntla Kavitha) ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఆమె వెంట మంత్రి కేటీఆర్ , ఆమె భర్త అనిల్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. కాగా గత విచారణ సమయంలో కూడా మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు హస్తినలోనే మకాం వేశారు. విచారణ తరువాత వారంతా కలిసి హైదరాబాద్ కు వచ్చారు. ఇక రేపు ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో కవిత (MLC Kalvakuntla Kavitha)ఢిల్లీకి వెళ్లడం..ఆమె వెంట మరోసారి మంత్రి, ఎంపీ కూడా వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఆమె ఈడీ విచారణకు హాజరవుతారా లేక మరో గడువు కోరతారా అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా ఈనెల 16న నెలకొన్న హైడ్రామాతో రేపు ఏం జరగబోతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..

కాగా ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత (MLC Kalvakuntla Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓ మహిళను ఈడీ ఆఫీస్ లో విచారించడంపై..రాత్రి 8 గంటల వరకు విచారించడాన్ని సవాల్ చేస్తూ ఆమె పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఈనెల 24న విచారణ జరుపుతామని కోర్టు తెలిపగా..కోర్టు తీర్పు తర్వాతే విచారణకు హాజరవుతానని కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీకి సమాచారం అందించారు. అయినా కానీ ఈడీ ఈనెల 20న విచారణకు రావాలని కవిత (MLC Kalvakuntla Kavitha)కు నోటీసులు ఇచ్చింది. అయితే ఆమె ఈ విచారణకు వెళ్తారా? లేదా? అనేది సస్పెన్స్ కొనసాగింది. కానీ ఆమె ఢిల్లీకి వెళ్లడంతో విచారణ కోసమే వెళ్లారని ప్రచారం జరుగుతుంది. మరి రేపు ఈడీ విచారణలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.

కవితకు ఈడీ షాక్..!

సుప్రీంకోర్టుకు వెళ్లిన కవితకు ఈడీ షాకిచ్చింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి తీర్పు ఇవ్వొద్దని ఆమె పిటీషన్ పై కేవియట్ దాఖలు చేశారు. దీనితో కోర్టు ఇరువర్గాల వాదనలు విననుంది. అయితే అంతకుముందే కవిత ఈడీ విచారణ ఉండడంతో ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

First published:

Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Telangana

ఉత్తమ కథలు