Home /News /telangana /

KALVAKUNTLA KAVITHA STARTS THREE NEW ANNADANAM CENTER FOR MIGRANT LABOURERS BA

వలస కూలీల కడుపు నింపుతున్న కల్వకుంట్ల కవిత...

నిజామాబాద్‌లో వలస కూలీలకు అన్నదానం

నిజామాబాద్‌లో వలస కూలీలకు అన్నదానం

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి వారిని ఆదుకున్నారు.

    కష్టాల్లో ఉన్నప్పుడు కనికరించే వారే నిజమైన నాయకులు అన్న పదానికి నిదర్శనంగా నిలిచారు కల్వకుంట్ల కవిత. గత రెండు సంవత్సరాలుగా నిజామాబాద్ , బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కల్వకుంట్ల కవిత, ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు గాను మరో మూడు కొత్త అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రజలు కవిత దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే దీనిపై దృష్టి సారించిన కల్వకుంట్ల కవిత, ఆయా ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులతో చర్చించి, అవసరమైన చోట అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయించారు.

    నిజామాబాద్‌లో వలస కూలీలకు అన్నదానం


    నిజామాబాద్ పట్టణంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల కోసం ప్రత్యేకంగా ఒక అన్నదాన కేంద్రాన్ని ఈ రోజు నగర మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించారు. ఇందులో ప్రతి రోజు దాదాపు 500 మంది అన్నార్తులకు భోజనం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పోరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని జెడ్పీ ఛైర్మన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దీంతో పాటు మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మరో అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు.

    నిజామాబాద్‌లో వలస కూలీలకు అన్నదానం


    కల్వకుంట్ల కవిత , రెండు సంవత్సరాల క్రితం ఎంపీ హోదాలో ఒకసారి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా రోగులతో పాటు అక్కడ ఉన్న సహాయకులు తమకు ఎదురవుతున్న భోజన ఇబ్బందులను అని ఆమె దృష్టికి తీసుకు రావడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Kalvakuntla Kavitha, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు