KALVAKUNTLA KAVITHA JAI HANUMAN SLOGAN TO COUNTER BJP JAI SRIRAM SLOGAN IN TELANGANA POLITICS AK KNR
Kalvakuntla Kavitha: జై హనుమాన్ అంటున్న కేసీఆర్ కూతురు కవిత.. కాశీ నుంచి వచ్చిన 15 రోజుల్లోనే..
కొండగట్టు ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు
Kalvakuntla Kavitha: కాశీ నుండి తిరిగి వచ్చిన తర్వాత వెనువెంటనే జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి కవిత.. రామకోటి సస్తూపం ఎంతో పవిత్రమైనదని దానిని త్వరలోనే కొండగట్టులో నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయాల్లో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయడానికి ఒక్కోసారి వాళ్లు అనుసరించిన మార్గాల్లోనే వెళ్లవలసి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి పాలైన మాజీ ఎంపీ కవిత.. ఇప్పుడు అదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, నిజాంబాద్ ఎంపీ అరవింద్, ఏ సభలో ప్రసంగించినా ముందు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తుంటారు. ఇవి ఆ పార్టీకి కలిసొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ నినాదాలను తిప్పికొట్టేందుకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత తీర్థ క్షేత్రాలను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.
అందులోనే భాగంగా గత నెలలో కాశి తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు అక్కడ పూజారులు రామకోటి స్తూపం ఎంతో మహిమ గలదని నేపాల్‌తో పాటు మన కాశీ దివ్యక్షేత్రాలలో మాత్రమే రామకోటి స్తూపం మహిమ గలదని అర్చకులు కవితకు చెప్పినట్టు తెలుస్తోంది. కాశీ నుండి తిరిగి వచ్చిన తర్వాత వెనువెంటనే జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి కవిత.. రామకోటి సస్తూపం ఎంతో పవిత్రమైనదని దానిని త్వరలోనే కొండగట్టులో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దానితోపాటు హనుమాన్ జయంతి వేడుకలకు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని... దానికి తగిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఆమె అలా చెప్పి వెళ్లిన 15 రోజుల రోజుల వ్యవధిలోనే ఈ రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు దేవాదాయ శాఖ మంత్రి తో కలిసి ఎమ్మెల్సీ కవిత రామస్తుపంకు ఉత్తరద్వారంలో భూమి పూజ చేశారు. దీంతో జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు వెళ్లే నిజామాబాదు ఎంపీ అరవింద్ కు జై హనుమాన్ తో కవితా చెక్ పెడుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
రామకోటి స్తూపానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్సీ కవిత
ఎంపీ అరవింద్ తనదైన స్టైల్లో మాజీ ఎంపీ కవితపై విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో అరవింద్ వ్యూహాలకు చెక్ పెట్టబోతున్నారని.. ఆ ప్రయత్నంలో భాగమే శ్రీరామ కోటి స్తూప భూమి పూజ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జై శ్రీరామ్ అంటున్న బీజేపీ నేతలకు జై హనుమాన్ అనే నినాదంతో చెక్ పెట్టాలని చూస్తున్న కవిత వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.