గల్ఫ్ బాధితుడి గుండెల్ని పిండేసే కథ... కవిత సాయంతో సొంతూరుకి...

కల్వకుంట్ల కవిత, పోతురాజుల శ్రీనివాస్

రోడ్డు ప్రమాదంలో భార్య, కూతురిని కోల్పోయిన గల్ఫ్ బాదితుని అభ్యర్థనకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు.

  • Share this:
    రోడ్డు ప్రమాదంలో భార్య, కూతురిని కోల్పోయిన గల్ఫ్ బాదితుని అభ్యర్థనకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇవాళ లక్సెట్టిపేటలోని స్వగృహంలో జరిగే పెద్ద కర్మ కు వెళ్ళి వచ్చేందుకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ద్వారా అనుమతి ఇప్పించడంతో పాటు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించారు. ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ కన్నీరు మున్నీరైన దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే, లక్షెట్టిపేటకు చెందిన పోతరాజుల శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్ళాడు. ఈ నెల 15న మందమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని భార్య సుజాత, కూతురు కావ్య దుర్మరణం చెందారు. దుబాయ్‌లో లాక్ డౌన్, అంతర్జాతీయ విమానాల రద్దు కారణంగా వీడియో కాల్ లోనే తన భార్య కూతుళ్ల అంత్యక్రియలు చూసి కన్నీరు మున్నీరయ్యాడు. మొన్న రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ, నిబంధనల ప్రకారం హైదరాబాద్‌లో క్వారంటైన్ లో ఉంచారు. బాధితుడు నేడు తన స్వగ్రామం లక్సెట్టిపేటలో జరిగే భార్యా కూతుళ్ల పెద్దకర్మకు హాజరవుతానని ఇందుకు సహచరించాల్సిందిగా దుబాయ్ లోని ఈటీసీఏ బాధ్యుల ద్వారా మాజీ ఎంపీ కవితను కోరారు. వెంటనే స్పందించిన కవిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. నిన్న రాత్రి ప్రభుత్వ ప్రత్యేక అనుమతి రాగా నేడు ఉదయం బాధితుడు మాజీ ఎంపీ కవిత కార్యాలయం ఏర్పాటు చేసిన వాహనంలో తన స్వగ్రామం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట బయలుదేరి వెళ్ళారు. ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.    భార్యా బిడ్డల భవిష్యత్తు కోసం అందరినీ విడిచి దుబాయ్ వెళ్తే, రోడ్డు ప్రమాదం తన కుటుంబాన్నే చిదిమేసిందని విలపించాడు. క్వారంటైన్ లో ఉన్న కారణంగా చిన్న కూతురు తన దగ్గరకు వస్తుంటే వద్దని వారించిన శ్రీనివాస్ దూరంగానే కూర్చుని రోదించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. శ్రీనివాస్ కు భార్య సుజాత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత శుక్రవారం సుజాత సోదరి ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళి వస్తుండగా మామాడికాయల లోడ్ తో వస్తున్న లారీ ఢీ కొట్టి సుజాత, పెద్దకూతురు కావ్య, మరో సమీప బంధువు మృతి చెందారు. కష్టకాలంలో తనను ఆదుకున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు పోతరాజుల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: