కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం...విజయవంతమైన గాయత్రి పంపుహౌస్ ట్రయల్ రన్

గాయత్రి పంపుహౌజ్‌లో నిర్వహించిన మూడోపంపు వెట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌజ్‌లో మొత్తం ఏడు అతిపెద్ద పంపులను ఏర్పాటు చేయగా ఇప్పటికే 1,2,4,5,6 పంపులను అధికారులు వెట్ ట్రయల్ రన్ నిర్వహించారు.

news18-telugu
Updated: October 20, 2019, 9:58 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం...విజయవంతమైన గాయత్రి పంపుహౌస్ ట్రయల్ రన్
కాళేశ్వరం ప్రాజెక్టు
  • Share this:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌజ్‌లో నిర్వహించిన మూడోపంపు వెట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌజ్‌లో మొత్తం ఏడు అతిపెద్ద పంపులను ఏర్పాటు చేయగా ఇప్పటికే 1,2,4,5,6 పంపులను అధికారులు వెట్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఏడు పంపుల్లో ఐదు పంపులకు వెట్ ట్రయల్ రన్‌ను పూర్తి చేశారు. ఇందులో ఒకవైపు మిడ్ మానేరుకు, మరో వైపు రివర్స్ పంపింగ్‌లో భాగంగా ఎస్‌ఆర్‌ఎస్‌పికి నీటిని సరఫరా చేశారు. కాగా, మూడోపంపు వెట్ ట్రయల్న్ కోసం ధర్మారం మండలం నందిమేడారం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తి నీటిని నేడు వదలగా నేరుగా ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంపుహౌజ్ సర్జిఫూల్‌కు చేరుకొంది. భూగర్భంలోని కంట్రోల్‌రూమ్‌లో అధికారులు డెలివరీ సిస్టమ్ వద్ద ఉండి పర్యవేక్షించారు. సాయంత్రం 6 గంటల వరకు మూడుసార్లు సైరన్ మోగించిన అధికారులు 6.20 గంటలకు మూడోపంపు వెట్ ట్రయల్ రన్ నిర్వహించారు.

సుమారు గంటపాటు నడిపించి మోటార్‌ను ఆపేశారు. కాగా, మూడోమోటార్ వెట్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ప్రాజెక్టు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏఈఈలు సురేశ్, శ్రీనివాస్, రమేశ్, ట్రాన్స్‌కో డీఈఈ దీకొండ భూమయ్య, మెగా ఏజన్సీ ప్రతినిధులు ఉన్నారు.
Published by: Krishna Adithya
First published: October 20, 2019, 9:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading