హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kakatiya Utsav 2022 : జులై 7 నుంచి కాకతీయ వైభవ వారోత్సవాలు -రుద్రమ వంశీకుల రాక

Kakatiya Utsav 2022 : జులై 7 నుంచి కాకతీయ వైభవ వారోత్సవాలు -రుద్రమ వంశీకుల రాక

కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర

కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర

కాకతీయుల వైభవాన్ని, తెలంగాణ సాంసృతిక పునర్వైభవాన్ని చాటిచెప్పేలా రాష్ట్రవ్యాప్తంగా జూలై 7 నుంచి ‘కాకతీయ సప్తాహం ఉత్సవాలు’ నిర్వహించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఈ సారి వేడుకలకు కాకతీయ వారసులను సైతం ఆహ్వానించారు.

కాకతీయుల వైభవాన్ని, తెలంగాణ సాంసృతిక పునర్వైభవాన్ని చాటిచెప్పేలా రాష్ట్రవ్యాప్తంగా జూలై 7 నుంచి ‘కాకతీయ సప్తాహం ఉత్సవాలు’ (Kakatiya Utsav 2022) నిర్వహించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. కార్యక్రమ నిర్వాహణకు సంబంధించి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ (KTR), పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) సూచన మేరకు ఈ సారి వేడుకలకు కాకతీయ వారసులను సైతం ఆహ్వానించారు.

జూలై 7 నుంచి వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏడు రోజుల పాటు నిర్వహించనున్న కాకతీయ వైభవ సప్తాహంపై ప్రగతిభవన్‌లో సన్నాహక సమీక్ష తర్వాత మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్ఠను పెంచేవిధంగా ఖర్చుకు వెనుకాడకుండా రాజకీయాలకు అతీతంగా, అందరూ పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన అన్నివర్గాల మేధావులు, కవులు, సాహితీవేత్తలను గౌరవించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు.

ఉత్సవాలకు కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భాంజ్‌దేవ్‌ను ఆహ్వానించిన విప్ వినయ్ భాస్కర్, అధికారి మామిడి హరికృష్ణ ((గత వారం ఫొటో)

CM KCR : కేసీఆర్ వ్యూహం మారిందా? BRSకు బైబై.. TRSపైనే ఫోకస్ -20 నుంచి జిల్లాల పర్యటన!


కాకతీయ వైభవ వారోత్సవాల్లో భాగంగా సాహితీ, సాంసృతిక, కళ కార్యక్రమాలను, మేథో చర్చలను రూపొందించాలని, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలు ఉండాలని, ప్రజలందరూ గర్వపడేలా ఉత్సవాలు ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. వరంగల్‌ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్‌ దీపాలతో అలంకరించాలన్నారు.

Jagananna Vidya Kanuka : నేడే స్కూళ్ల రీఓపెనింగ్ -విద్యా దీవెన పంపిణీ -ఆదోనిలో సీఎం జగన్ సభ


సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉత్సవాలకు ఛత్తీస్ గఢ్ లో ఉంటోన్న కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భాంజ్‌దేవ్‌ను ఇప్పటికే తెలంగాణ మంత్రులు ఆహ్వానించారు. 700 ఏళ్ల తర్వాత కాకతీయుల వారసుడు వస్తున్న నేపథ్యంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సూచించారు. ఉత్సవాలలో సాంసృతిక, సాహిత్య, కళ ప్రదర్శనలు నిర్వహిస్తారు.

First published:

Tags: Festival, KTR, Telangana, Warangal

ఉత్తమ కథలు