• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • KADAKNATH CHICKEN IS NOW THE COSTLIEST MEAT AND THE MEAT IS BEING SOLD AT RS 1000 TO RS 1500 PER KG IN KARIMNAGAR SSR

Kadaknath Chicken: అమాంతం కొండెక్కిన కడక్‌నాథ్ చికెన్ ధరలు.. ఈ చికెన్‌కు ఇంత గిరాకీ ఉండటానికి కారణం ఏంటంటే..

Kadaknath Chicken: అమాంతం కొండెక్కిన కడక్‌నాథ్ చికెన్ ధరలు.. ఈ చికెన్‌కు ఇంత గిరాకీ ఉండటానికి కారణం ఏంటంటే..

కడక్‌నాథ్ కోడిపిల్ల, కోళ్లు

కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఖర్చుతో కూడుకున్న పని. సాధారణ బ్రాయిలర్ కోళ్ల ఎదుగుదలకు ఇంజెక్షన్ ఇస్తే మరింత వేగంగా బరువు పెరిగే అవకాశం ఉండగా ఇందుకు పూర్తి భిన్నంగా కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఉంటుంది. అంటే ఈ కోడి ఎదుగుదల ఎలాంటి ఇంజెక్షన్ వాడకుండా...

  • Share this:
    కరీంనగర్: మాంసం ప్రియులకు మేలుజాతి వజ్రం కడక్ నాథ్ కోళ్లు . పుష్కలంగా పోషకాలు, ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి మాంసాన్ని న్యూట్రిషనిస్టులు ప్రధానంగా సూచిస్తున్నారు. పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే కోవిడ్‌ను నిరోధించవచ్చని వైద్యులు సూచిస్తుండటంతో.. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ కోళ్లకు మరొకసారి డిమాండ్ అమాంతంగా పెరిగింది. ఫలితంగా చికెన్, మటన్ కంటే కడక్‌నాథ్ చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా లభ్యమవుతున్న ఈ కోళ్లకు ఇటీవల మంచి డిమాండ్ ఏర్పడింది. కడక్‌నాథ్ కోళ్ల మాంసాన్ని తినేందుకు మాంసాహార ప్రియులు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కోళ్లు ఎక్కువగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో లభిస్తాయి. ఈ కోళ్లు నల్లజుట్టుతో ఉంటాయి. దీని గుడ్డు కాఫీ కలర్‌లో ఉంటుంది. ఈ కోళ్ల మాంసంలో 29 శాతం ప్రొటీన్స్ లభిస్తాయి. జీరో శాతం కొవ్వు ఉండే ఈ మాంసం తింటే ప్రధానంగా ఊబకాయం తగ్గిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కడక్‌నాథ్ కోళ్ల మాంసం తింటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడమే కాకుండా శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి వ్యాధులు కూడా నయమవుతాయట.అంతేకాదు, ఈ మాంసానికి మగవారిలో సంతానోత్పత్తిని పెంచే గుణాలుంటాయని కూడా అమ్మకందారులు చెబుతున్నారు. కడకనాథ్ కోడి ఎదుగుదలకు కొంత ఎక్కువ సమయమే పడుతుంది. ఈ కోడి బరువు తూగేందుకు 8 నెలల కాలం పడుతుందని పెంపకందారులు చెబుతున్నారు.

    సాధారణ మార్కెట్లో లభించే బ్రాయిలర్ కోళ్లు 45 రోజుల్లోనే ఎదుగుతాయి. కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఖర్చుతో కూడుకున్న పని. సాధారణ బ్రాయిలర్ కోళ్ల ఎదుగుదలకు ఇంజెక్షన్ ఇస్తే మరింత వేగంగా బరువు పెరిగే అవకాశం ఉండగా ఇందుకు పూర్తి భిన్నంగా కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఉంటుంది. అంటే ఈ కోడి ఎదుగుదల ఎలాంటి ఇంజెక్షన్ వాడకుండా సహజంగా ఉంటుంది. దీంతో.. ధర ఎక్కువగా ఉన్నా ఈ మాంసం కొనేందుకు మాంస ప్రియులు ఏమాత్రం వెనుకాడడం లేదు.

    కరీంనగర్ జిల్లా కేంద్రంలోని న్యూట్రిషన్ డాక్టర్లు ప్రతీ వారం కోళ్ల ఫారం వద్ద నుంచి కడక్‌నాథ్ కోళ్లు కొనుగోలు చేస్తున్నారు. కడక్‌నాథ్ కోడి మాంసం కేజీ ధర రూ.1000 నుంచి రూ .1500 వరకూ పలుకుతోంది. భారత క్రికెట్ బోర్డు క్రికెట్ జట్టుకు అందించే ఆహార మెనూలో కడక్‌నాథ్ మాంసం తప్పనిసరి చేసింది. క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోని కూడా సుమారు రెండువేల కోళ్లను పెంచుతున్నాడని అగ్రి ఫాం నిర్వాహకుడు పల్లె రాజుపటేల్ చెబుతున్నాడు.


    పి. శ్రీనివాస్, న్యూస్ 18తెలుగు కరస్పాండెంట్

    Published by:Sambasiva Reddy
    First published: