కాచిగూడ రైలు ప్రమాదం: MMTS డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి విషమం..

నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ కోలుకున్నాక.. అతడి నుంచి వాంగ్మూలం తీసుకోవాలని భావిస్తున్నారు. ఐతే లోకో పైలట్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు అతడిని కలిసే పరిస్థితి లేదు.

news18-telugu
Updated: November 12, 2019, 4:21 PM IST
కాచిగూడ రైలు ప్రమాదం: MMTS డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి విషమం..
రైలు ప్రమాదం
  • Share this:
కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు నాంపల్లిలోని కేర్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.  చంద్రశేఖర్ రెండు కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోయిందని..  పక్కటెముకలు, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డాక్టర్లు వెల్లడించారు. లోకో పైలట్‌తో పాటు రైలు ప్రమాదంలో గాయపడిన శేఖర్, రాజ్ కుమార్, సాజిద్, మహమ్మద్ ఇబ్రహీం, బాలేశ్వరమ్మకు చికిత్స కొనసాగుతుందని.. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.

కాచిగూడలో రైలు ప్రమాదానికి ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అతడిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.  కాచిగూడ స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసుపెట్టి దర్యాప్తు చేస్తున్నారు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ కోలుకున్నాక.. అతడి నుంచి వాంగ్మూలం తీసుకోవాలని భావిస్తున్నారు. ఐతే లోకో పైలట్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు అతడిని కలిసే పరిస్థితి లేదు.

సోమవారం ఉదయం హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో  రైలు ప్రమాదం జరిగింది.  కాచిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును.. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్‌పై రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇంజిన్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ సహా 18 మందికి గాయాలయ్యాయి.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు