టెన్షన్ పెట్టిస్తున్న హైదరాబాద్ పావురాలు... తలపట్టుకుంటున్న GHMC
Hyderabad Pigeons : హైదరాబాద్‌లో 6 లక్షల పావురాలు ఉంటాయని అంచనా. వాటి వల్ల 15 రకాల వ్యాధులు వ్యాపిస్తుండటంతో... వాటి సంఖ్య పెరగకుండా, వాటితో వ్యాధులు వ్యాపించకుండా ఏం చెయ్యాలా అని GHMC అధికారులు నానా తిప్పలు పడుతున్నారు.
news18-telugu
Updated: November 19, 2019, 1:41 PM IST

టెన్షన్ పెట్టిస్తున్న హైదరాబాద్ పావురాలు... తలపట్టుకుంటున్న GHMC
- News18 Telugu
- Last Updated: November 19, 2019, 1:41 PM IST
Hyderabad Pigeons : ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు పావురాలు సమస్య అవుతున్నాయి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ తింటూ ఉండే పావురాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. వాటి సంఖ్య తగ్గించేందుకు ఒక్కో దేశం ఒక్కోలా ప్రయత్నిస్తోంది. కొన్ని దేశాల్లో వాటిని వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తుంటే... కొన్ని దేశాల్లో వాటికి పిల్లలు పుట్టకుండా మందులు ఇస్తున్నారు. హైదరాబాద్‌కి పావురాలు ఎంత అందమో... అంత ప్రమాదకరంగా కూడా మారుతున్నాయి. కొత్త, పాత ఇలా అన్ని రకాల భవనాలపై అవే కనిపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఎగురుతూ... గాలిలో రకరకాల బ్యాక్టీరియాను చేరవేస్తున్నాయి. వాటి వల్ల వచ్చే వ్యాధులు, వ్యాపించే వైరస్‌లను అడ్డుకోవడం మన వల్ల కావట్లేదు. ఇటీవల GHMC... 500 పావురాల్ని మొజాంజాహీ మార్కెట్ ప్రాంతంలో పట్టుకొని... శ్రీశైలం అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేసింది.

హైదరాబాద్‌లో పావురాల సంఖ్య పెరుగుతుండటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. వాటిని చాలా మంది ఇష్టంగా పెంచుకుంటున్నారు. వాటికి ప్రత్యేకంగా ఆహారం కొని వేస్తున్నారు. ఇలా హైదరాబాద్ పరిసరాల్లో చాలా చోట్ల పావురాల ఫీడింగ్ ప్రదేశాలున్నాయి. దానికి తోడు పావురాలు తినే గింజలు హైదరాబాద్‌లో వాటికి బాగా దొరుకుతున్నాయి. షాకింగ్ విషయమేంటంటే... ఈ పావురాల వల్ల హైదరాబాద్‌లో చిలుకలు, మనాలు, పారాకీట్ వంటి పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. ఒకప్పుడు అవి పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు.పావురాల వల్ల ఇవీ సమస్యలు :
* హైదరాబాద్‌లో పావురాలు 15 రకాల వ్యాధులు వ్యాపించేందుకు కారణం అవుతున్నాయి.
* చాలా పావురాలకు రకరకాల వ్యాధులున్నాయి. అవి గాల్లో ఎగురుతుంటే... వైరస్ ప్రజలకు చేరుతోంది.
* పావురాల వల్ల ప్రజలు ఎక్కువగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. * తీవ్రమైన దగ్గు, జ్వరం, COPD, ఆస్తమా వంటి రుగ్మతలకు వస్తుండటానికి పావురాలు కారణమవుతున్నాయి.
* పావురాల రెక్కలు, ఈకలు, రెట్టలు అన్నీ మనుషులకు ప్రమాదకరమే.
* ప్రజలకు చర్మం, నోరు, పొట్ట దెబ్బతింటాయి. తలనొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. స్వైన్ ఫ్లూ కూడా వచ్చేలా ఉంది.
చాలా విదేశాల్లో పావురాల పెంపకంపై నిషేధం ఉంది. ఎవరైనా వాటికి ఆహారం వేస్తే ఫైన్లు కట్టిస్తున్నారు. కొన్ని పక్షుల్ని పట్టుకొని... శ్రీశైలం అడవుల్లో వదిలేసి... చేతులు దులుపుకుంటే సరిపోదు. నిజానికి పావురాలు అడవుల్లో ఉండేందుకు ఇష్టపడవు. అవి ప్రజల మధ్య ఉండటానికే ఇష్టపడతాయి. అందువల్ల అడవిలో వదిలేసినవి తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. ఎందుకంటే పావురాలకు ప్రత్యేక ప్రత్యేక గ్రాహక శక్తి ఉంటుంది. ఈ భూమిపై వాటిని ఎక్కడ వదిలినా... అవి తిరిగి తమ సొంత ప్రాంతానికి వచ్చేయగలవు. ఇది హైదరాబాద్ సమస్య. దీనిపై GHMC, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సీరియస్‌గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో GHMC కూడా పావురాల్ని పెంచవద్దనీ, వాటికి ఆహారం వెయ్యవద్దనీ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి :
ఈ పండ్ల విశేషాలు తెలుసా మీకు?
గేర్ రాడ్డు అమ్మాయిల చేతిలో పెట్టాడు... డ్రైవర్ తిక్క కుదిరింది...
మిమిక్రీ చేస్తున్న చిలక... నెట్లో వైరల్ వీడియో...
డాన్స్‌తో ట్రాఫిక్‌కి చెక్... MBA అమ్మాయి వీడియో వైరల్...

టెన్షన్ పెట్టిస్తున్న హైదరాబాద్ పావురాలు... తలపట్టుకుంటున్న GHMC
హైదరాబాద్‌లో పావురాల సంఖ్య పెరుగుతుండటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. వాటిని చాలా మంది ఇష్టంగా పెంచుకుంటున్నారు. వాటికి ప్రత్యేకంగా ఆహారం కొని వేస్తున్నారు. ఇలా హైదరాబాద్ పరిసరాల్లో చాలా చోట్ల పావురాల ఫీడింగ్ ప్రదేశాలున్నాయి. దానికి తోడు పావురాలు తినే గింజలు హైదరాబాద్‌లో వాటికి బాగా దొరుకుతున్నాయి. షాకింగ్ విషయమేంటంటే... ఈ పావురాల వల్ల హైదరాబాద్‌లో చిలుకలు, మనాలు, పారాకీట్ వంటి పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. ఒకప్పుడు అవి పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు.పావురాల వల్ల ఇవీ సమస్యలు :
* చాలా పావురాలకు రకరకాల వ్యాధులున్నాయి. అవి గాల్లో ఎగురుతుంటే... వైరస్ ప్రజలకు చేరుతోంది.
* పావురాల వల్ల ప్రజలు ఎక్కువగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు.
Loading...
* పావురాల రెక్కలు, ఈకలు, రెట్టలు అన్నీ మనుషులకు ప్రమాదకరమే.
* ప్రజలకు చర్మం, నోరు, పొట్ట దెబ్బతింటాయి. తలనొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. స్వైన్ ఫ్లూ కూడా వచ్చేలా ఉంది.
చాలా విదేశాల్లో పావురాల పెంపకంపై నిషేధం ఉంది. ఎవరైనా వాటికి ఆహారం వేస్తే ఫైన్లు కట్టిస్తున్నారు. కొన్ని పక్షుల్ని పట్టుకొని... శ్రీశైలం అడవుల్లో వదిలేసి... చేతులు దులుపుకుంటే సరిపోదు. నిజానికి పావురాలు అడవుల్లో ఉండేందుకు ఇష్టపడవు. అవి ప్రజల మధ్య ఉండటానికే ఇష్టపడతాయి. అందువల్ల అడవిలో వదిలేసినవి తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. ఎందుకంటే పావురాలకు ప్రత్యేక ప్రత్యేక గ్రాహక శక్తి ఉంటుంది. ఈ భూమిపై వాటిని ఎక్కడ వదిలినా... అవి తిరిగి తమ సొంత ప్రాంతానికి వచ్చేయగలవు. ఇది హైదరాబాద్ సమస్య. దీనిపై GHMC, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సీరియస్‌గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో GHMC కూడా పావురాల్ని పెంచవద్దనీ, వాటికి ఆహారం వెయ్యవద్దనీ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
Pics : బ్రైడల్ ఫొటోషూట్‌లో మెరిసిన జియా మానెక్
ఇవి కూడా చదవండి :
Health : నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా... డేంజరే.