HOME »NEWS »TELANGANA »k tarakarama rao ktr to become telangana chief minister but these doubts remains ak

KTR: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్.. ఇది పక్కా.. కానీ అదొక్కటే డౌట్..

KTR: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్.. ఇది పక్కా.. కానీ అదొక్కటే డౌట్..
కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసిన తరువాత ఎన్నికలకు వెళితే.. టీఆర్ఎస్‌కు సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తే.. కేసీఆర్ ఎన్నికలకు ముందే ఆయనకు సీఎం పగ్గాలు ఇవ్వొచ్చనే పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Share this:
    తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పు జరగబోతోంది. తెలంగాణ మంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తనయుడు కేటీఆర్... త్వరలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కొంతకాలంగా వినిపిస్తున్న ఈ ఈ ఊహాగానాలు నిజమే అనే సంకేతాలు టీఆర్ఎస్ నేతలంతా ఒక్కొక్కరిగా ఇస్తున్నారు. పలువురు తెలంగాణ మంత్రులు ఇప్పటికే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతుండగా... కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు అంటూ తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీమంత్రి పద్మారావు ఆయన ముందే వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించలేదు. ఇది నిజంకాదని ఖండించలేదు. దీంతో తాను త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నాననే విషయాన్ని ఆయన కూడా అంగీకరించినట్టే అని తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎప్పుడు పగ్గాలు చేపడతారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

    తెలంగాణలో త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా రావొచ్చని సమాచారం. దీంతో పాటు రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలకు కూడా జరగాల్సి ఉంది. వీటితో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ పట్టాభిషేకం ఈ ఎన్నికల ముందు జరుగుతుందా లేక ఈ ఎన్నికల తరువాత జరుగుతుందా అనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలు జరిగిన తరువాతే సీఎం కేసీఆర్ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని కొందరంటుంటే.. చాలా అంశాల్లో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకునే కేసీఆర్.. ఈ విషయంలోనూ భిన్నంగా ఆలోచించవచ్చనే టాక్ వినిపిస్తోంది.



    కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసిన తరువాత ఎన్నికలకు వెళితే.. టీఆర్ఎస్‌కు సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తే.. కేసీఆర్ ఎన్నికలకు ముందే ఆయనకు సీఎం పగ్గాలు ఇవ్వొచ్చనే పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్నికలు జరిగి.. అందులోనూ బీజేపీ దూకుడు కొనసాగితే మాత్రం టీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ సీఎంగా కేటీఆర్ పగ్గాలు చేపట్టడం ఖాయమనే సంకేతాలు వస్తుండటంతో.. ఈ ప్రభావం రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికలపై ఏ విధంగా ఉంటాయనే అంశం ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:January 21, 2021, 14:22 IST